Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Bangladesh: రెండో టీ20లో రోహిత్ సిక్సర్ల వర్షం.. ధోనీ రికార్డు బద్దలు!!

India vs Bangladesh 2019 : Rohit Sharma Breaks MS Dhoni's Record For Most Sixes In T20Is
Rohit Sharma breaks MS Dhonis most sixes record after Rajkot T20I

రాజ్‌కోట్‌: బంగ్లాదేశ్‌తో గురువారం రాత్రి జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (85; 43 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో భారత్‌ 15.4 ఓవర్లలో 2 వికెట్లకు 154 పరుగులు చేసి గెలిచింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. చివరి మ్యాచ్‌ ఆదివారం నాగ్‌పూర్‌లో జరుగుతుంది.

ధోనీ రికార్డును బద్దలు:

ధోనీ రికార్డును బద్దలు:

రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ ఆరు సిక్సుర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (37) బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ధోనీ (34) పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. ధోనీ 62 ఇన్నింగ్స్‌లో 34 సిక్సర్లు బాదగా.. రోహిత్‌ కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే 37 సిక్సర్లు బాదాడు. ఇక 26 ఇన్నింగ్స్‌లో 26 సిక్సర్లతో విరాట్‌ కోహ్లీ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు:

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు:

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌‌మెన్ల జాబితాలో మాత్రం రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (534) టాప్‌లో ఉండగా.. పాకిస్తాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (398), మెకల్లం (398)లు మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు.

 కోహ్లీతో సమంగా:

కోహ్లీతో సమంగా:

23 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన రోహిత్.. అంతర్జాతీయ టీ20ల్లో తన రెండో వేగవంతమైన హాఫ్‌ సెంచరీ సాధించాడు. దీంతో అత్యధిక అర్ధ సెంచరీల రికార్డును కూడా సమం చేశాడు. 22వ అర్ధ సెంచరీతో విరాట్‌ కోహ్లీతో కలిసి సమంగా నిలిచాడు. కెప్టెన్‌గా ఇద్దరూ ఆరు అర్థ సెంచరీలు చేశారు.

 బౌలర్లను తక్కువగా అంచనా వేయను:

బౌలర్లను తక్కువగా అంచనా వేయను:

మ్యాచ్ అనన్తరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... 'స్పిన్నర్లు పిచ్‌ను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. గత మ్యాచ్‌ తప్పులను సరిదిద్దుకున్నాం. వికెట్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ కష్టంగా మారిపోతుందని తెలుసు. దానిని సద్వినియోగం చేసుకుని పవర్‌ప్లేలో రెచ్చిపోయాం. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్‌ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో బంతిని బలంగా బాదాలని నిర్ణయించుకున్నా' అని అన్నాడు.

Story first published: Friday, November 8, 2019, 12:59 [IST]
Other articles published on Nov 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+