Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ : షాహిద్ అఫ్రిది రికార్డు బ్రేక్!

దక్షిణాఫ్రికాతో రాంచీలో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ కేవలం 3 సిక్సర్లు కొట్టడం ద్వారా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్ధలు కొట్టాడు. రోహిత్ శర్మ ఇప్పుడు వన్డే ఫార్మాట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు. రోహిత్ శర్మ వన్డే క్రికెట్‌లో ఇప్పుడు 352 సిక్సర్లు కొట్టాడు. షాహిది అఫ్రిది తన కెరీర్లో351 సిక్సర్లు బాదాడు.

రోహిత్ శర్మ ఈ ఘనతను తన 269వ వన్డే ఇన్నింగ్స్‌లో సాధించగా.. షాహిద్ అఫ్రిది 369 వన్డే ఇన్నింగ్స్‌లలో 351 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ శర్మ అఫ్రిది కంటే 100 ఇన్నింగ్స్ తక్కువగానే ఈ రికార్డును బద్దలు కొట్టడం విశేషం. ఈ క్రమంలో రోహిత్ శర్మ వన్డే క్రికెట్లో తన 60 అర్థ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. రోహిత్ శర్మ 43 బంతుల్లో తన అర్థ సెంచరీని పూర్తి చేశాడు. అయితే అర్ధ సెంచరీ చేసిన తర్వాత రోహిత్ శర్మ తన ఇన్నింగ్స్‌ను ఎక్కువగా కొనసాగించలేకపోయాడు. మార్కో యాన్సెన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రోహిత్ 51 బంతుల్లో 3 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 57 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఔట్ కావడానికి ముందు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీతో కలిసి 109 బంతుల్లో 136 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.

Rohit Sharma Breaks Afridi Record Becomes ODI Sixes King in Ranchi

టీమిండియా ప్రారంభం
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో టాస్ ఓడిన టీమిండియా ముందుగా బ్యాటింగ్ చేయవలసి వచ్చింది. రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే యశస్వి కేవలం 16 బంతుల్లో 18 పరుగులు చేసి ఔట్ కావడంతో టీమిండియాకు శుభారంభం దక్కలేదు. భారత జట్టు 25 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. యశస్విని దక్షిణాఫ్రికా పేసర్ నాండ్రే బర్గర్ ఔట్ చేశాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి ఇన్నింగ్స్‌ను స్థిరంగా ముందుకు నడిపించారు. రోహిత్ శర్మకు ఒక లైఫ్ కూడా లభించింది. దానిని రోహిత్ శర్మ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా ధాటిగా బ్యాటింగ్ చేస్తూ దక్షిణాఫ్రికా బౌలర్లకు ఇబ్బందులు సృష్టించాడు.

Story first published: Sunday, November 30, 2025, 16:00 [IST]
Other articles published on Nov 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+