కోట్ల రూపాయలతో టూరిస్ట్ ప్లేసులో భూమి కొన్న హిట్‌మ్యాన్.. ఎక్కడంటే..

ఇటీవల టీమిండియా కెప్టెన్‌గా ప్రమోషన్ పొందిన హిట్‌మ్యాన్ రోహిత్‌శర్మ ఫుల్ జోష్ మీదున్నాడు. ఇప్పటికే న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో వైట్‌వాష్ చేసి తన కెప్టెన్సీ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించాడు హిట్‌మ్యాన్. ఆ సిరీస్‌లో బ్యాటర్‌గానూ రోహిత్ సత్తా చాటాడు. ఇంతలోనే వన్డే కెప్టెన్సీతోపాటు టెస్ట్ ఫార్మాట్‌కు వైస్ కెప్టెన్‌గానూ రోహిత్‌కు డబుల్ ప్రమోషన్ లభించింది. ఈ జోష్‌లోనే ఓ ప్రాపర్టీ కూడా కొనేశాడు హిట్‌మ్యాన్.

భార్య పేరుపై భూమి కొన్న రోహిత్
తాజాగా రోహిత్‌శర్మ తన భార్య రితికా పేరు మీద భూమి కోనుగోలు చేశాడు. ముంబైలోని దక్షిణ అలీబాగ్‌లో రోహిత్ ఈ భూమిని కొన్నాడు. రోహిత్ మొత్తం 4 ఎకరాల భూమిని అక్షరాల తొమ్మిది కోట్ల రూపాయలకు కొన్నాడు. అంతేకాకుండా దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 14నే రిజిస్ట్రేషన్ చేయించాడు హిట్‌మ్యాన్.
ఈ విషయాన్ని అలీబాగ్ రిజిస్ట్రేషన్ కార్యలయంలోని ఓ అధికారి కూడా ధృవికరించాడు. భూమి రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రోహిత్ శర్మ మంగళవారం తమ కార్యలయానికి వచ్చిన మాట వాస్తవమే అని అలీబాగ్ సబ్‌రిజిస్ట్రార్ సంజనా జాదవ్ తెలిపారు. కాగా టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటిగా అలీబాగ్ ప్రఖ్యాతిగాంచింది. సుందరమైన ప్రదేశంగా అలీబాగ్‌కు పేరు కూడా ఉంది.

భూమిలో పూజ చేసిన రోహిత్ దంపతులు
రోహిత్ భూమి కొన్న స్థలం అలీబాగ్ నగరానికి సరిగ్గా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరల్ మత్రోలి అనే గ్రామంలో ఉంటుంది. అయితే రిజిస్ట్రేషన్ కార్యక్రమాలన్ని పూర్తయ్యాక ఆ స్థలంలో రోహిత్‌శర్మ దంపతులు ఓ చిన్నపాటి పూజ కూడా నిర్వహించారని ఆ గ్రామ సర్పంచ్ అమిత్ నాయక్ తెలిపారు. రోహిత్ భూమి కొన్న విషయాన్ని ఆయన ధృవికరించడంతోపాటు హిట్‌మ్యాన్ తమ గ్రామానికి రావడం ఇదే మొదటి సారని చెప్పారు.

భూమి కోనుగోలుకు స్థానికులు సహకారం
రోహిత్ శర్మ అలీబాగ్‌లో భూమి కొనడానికి స్థానికులు కూడా సహకరించారు. భూమి అమ్మిన వ్యక్తి తనకు తెలుసని, భూమి కోనుగోలు పత్రాలపై తాను సాక్షి సంతకాలు కూడా పెట్టినట్లు అలీబాగ్ నివాసి అయినా విక్రమ్ షేత్ చెప్పారు. రోహిత్ శర్మ తనకు 10 సంవత్సరాలుగా తెలుసన్న ఆయన.. భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ కార్యక్రమంలో ఇద్దరు న్యాయవాదులు కూడా పాల్గొన్నట్టు వివరించారు.

ఇదివరకే అలీబాగ్‌లో భూములు కొన్న సచిన్, కోహ్లీ
అలీబాగ్‌లో భూములు కొన్న వారిలో రోహిత్‌శర్మ మొదటి వాడు ఏం కాదు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, అజిత్ అగార్కర్, రవిశాస్త్రి అక్కడ ఇది వరకే |భూములు కొన్నారు. అలీబాగ్ సుందరమైన ప్రాంతాలలో ఒకటిగా పేరుగాంచింది. టూరిస్ట్‌కు హాట్ స్పాట్ కూడా. ముంబైలో ఉన్న ధనవంతుల్లో అనేక మందికి ఇక్కడ ఫామ్ హౌస్‌లు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్ సమయంలో విరాట్ కోహ్లీ తన భార్య అనుష్కతో ఇక్కడ తనకున్న ఫామ్‌హౌస్‌లోనే గడిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications