Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ టెండూల్కర్ కంటే రోహిత్ శర్మనే అత్యుత్తమ ఓపెనర్: మాజీ క్రికెటర్

Rohit Sharma Better ODI Opener Than Sachin Tendulkar, Feels Simon Doull

ఆక్లాండ్: వన్డే క్రికెట్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ అత్యుత్తమ ఓపెనర్ అని న్యూజిలాండ్ మాజీ ఫాస్ట్ బౌలర్, ప్రముఖ క్రికెట్ వ్యాఖ్యాత సైమన్ డౌల్ అన్నాడు. వన్డేల్లో సచిన్‌తో పోలిస్తే.. సగటు, స్ట్రైక్‌రేట్‌లోనూ రోహిత్ మెరుగ్గా ఉన్నట్లు సైమన్ డౌల్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తరహాలో సెంచరీ ముంగిట రోహిత్ ఒత్తిడికి గురికాడని, తనదైన శైలిలో సెంచరీ పూర్తిచేస్తాడన్నాడు. సైమన్ డౌల్ గతంలో రోహిత్ శర్మను తన ఉత్తమ వన్డే బ్యాట్స్‌మన్‌ అని కితాబిచ్చిన విషయం తెలిసిందే.

సచిన్ కంటే రోహితే బెస్ట్ ఓపెనర్:

సచిన్ కంటే రోహితే బెస్ట్ ఓపెనర్:

తాజాగా ఐసీసీ క్రికెట్ ఇన్సైడ్ అవుట్‌లో సైమన్ డౌల్ మాట్లాడుతూ... 'రోహిత్ శర్మ మ్యాచ్‌ పరిస్థితిని బట్టి రెచ్చిపోతాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే.. స్ట్రైక్‌రేట్‌ని అమాంతం పెంచుకుంటాడు. సునాయాసంగా అర్ధ శతకం చేస్తాడు. 60, 70, 80లోనే కాదు.. 90 స్కోర్ల వద్ద కూడా రోహిత్ ఒత్తిడి గురవడాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. సచిన్ తరహాలో సెంచరీ ముంగిట హిట్‌మ్యాన్ ఒత్తిడికి గురికాడు. వన్డేల్లో సచిన్‌తో పోలిస్తే.. సగటు, స్ట్రైక్‌రేట్‌లోనూ రోహిత్ మెరుగ్గా ఉన్నాడు. గణాంకాల పరంగా చూసుకుంటే.. సచిన్‌ కంటే రోహిత్ అత్యుత్తమ ఓపెనర్' అని అన్నాడు.

గణాంకాలను చూస్తే:

గణాంకాలను చూస్తే:

'వ్యక్తిగతంగా నాకు భారతదేశం చాలా ఇష్టం. గతంలోనే రోహిత్ శర్మ నెం .1 అని చెప్పాను. రోహిత్ ఆల్‌టైమ్ ఇండియన్ జట్టులో ఎంపికైన మొదటి ఓపెనర్. నన్ను క్షమించండి.. కానీ మీరు గణాంకాలను చూస్తే సచిన్‌ కంటే రోహితే అత్యుత్తమ ఓపెనర్. గణాంకాలను పరిశిలిస్తే.. రోహిత్ సంఖ్యలు అసాధారణమైనవి. అవి సచిన్ కంటే మెరుగ్గా ఉన్నాయి. అందుకే సచిన్‌ కంటే రోహిత్ అత్యుత్తమం అంటున్నా. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ కూడా వస్తాడు. అయితే ఎంఎస్ ధోనీ ఆర్డర్‌ను మరింత తగ్గించినపుడు అతన్ని లెక్కలోకి తీసుకోవచ్చు' అని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.

వన్డే ఫార్మాట్‌లో మూడు ద్విశతకాలు:

వన్డే ఫార్మాట్‌లో మూడు ద్విశతకాలు:

సుదీర్ఘ కెరీర్‌లో 463 వన్డేలాడిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్.. 44.83 సగటుతో 18,426 పరుగులు చేసాడు. సచిన్ స్ట్రైక్‌రేట్ 86.24గా ఉంది. రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 224 వన్డే మ్యాచ్‌లు ఆడగా.. 49.27 సగటుతో 9115 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో అతని స్ట్రైక్‌రేట్ 88.93గా ఉంది. వన్డేల్లో సచిన్ ఒక డబుల్ సెంచరీ చేయగా.. రోహిత్ మూడు ద్విశతకాలు చేసాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు ద్విశతకాలు చేసిన ఏకైక బ్యాట్స్‌మన్‌ రోహిత్ మాత్రమే.

 డౌల్‌కు డెత్ వార్నింగ్:

డౌల్‌కు డెత్ వార్నింగ్:

ఐపీఎల్ 12లో ఓ ఆర్సీబీ అభిమాని కామెంటేటర్ సిమన్‌ డౌల్‌‌ని చంపుతానంటూ హెచ్చరించాడు. ఆ టోర్నీలో భాగంగా జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌కి కామెంటేటర్‌గా ఉన్న సిమన్‌ డౌల్‌ మ్యాచ్ అనంతరం ఆర్సీబీ ఆటతీరుపై తీవ్ర విమర్శలు చేశాడు. దీంతో తట్టుకోలేకపోయిన ఓ అభిమాని ఆర్సీబీని విమర్శిస్తే చంపుతానంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు.

Story first published: Friday, May 8, 2020, 10:23 [IST]
Other articles published on May 8, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+