Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రో'హిట్' శర్మకు దక్కిన అరుదైన రికార్డు, కోహ్లీ2.. రోహిత్5

Rohit Sharma becomes third Indian to score 7,000 runs in T20s

హైదరాబాద్: అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టు సంబరాల్లో మునిగి తేలుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 42 బంతుల్లో 56 పరుగుల స్కోరు నమోదు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. కాగా, ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు.

నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై చెలరేగి ఆడిన హిట్ మ్యాన్.. 26 పరుగులు పూర్తి చేయగానే టీ20ల్లో 7 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ టీ20ల్లో ఏడు వేల పరుగులు దాటిన భారత బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తోంది సురేశ్ రైనా (7378), విరాట్ కోహ్లి (7095) మాత్రమే.

రోహిత్ శర్మ రికార్డులు ఇలా:
దేశీవాలీ టోర్నీలు మినహాయించి అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో రోహిత్‌ (1852)కు ఐదో స్థానం దక్కింది. ఇందులో కోహ్లీ(1983) మూడో స్థానంలో ఉండగా న్యూజిలాండ్ క్రికెటర్ మార్టిన్ గుప్తిల్ (2271) మొదటి, బ్రెండన్ మెక్‌కెల్లమ్(2140) రెండు, తిలకరత్నె దిల్‌షాన్(1889)..

ఐపీఎల్‌లో అద్భుతమైన రికార్డ్ ఉన్న రోహిత్ శర్మ 154 ఇన్నింగ్స్‌ల్లో 4207 పరుగులు చేశాడు. వీటిలో 32 అర్ధ సెంచరీలు ఒక సెంచరీ ఉన్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో 72 ఇన్నింగ్స్‌లు ఆడిన హిట్ మ్యాన్ 1850కిపైగా పరుగులు చేశాడు. వీటిలో రెండు సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడు కూడా రోహితే కావడం గమనార్హం. భారత్ తరఫున హిట్ మ్యాన్ 78 సిక్స్‌లు బాదాడు. తర్వాతి స్థానంలో యువరాజ్ సింగ్ (74) ఉన్నాడు. మూడో స్థానంలో సురేశ్ రైనా ఉండగా.. ధోనీ (46) నాలుగో స్థానంలో, కోహ్లి (41) ఐదో స్థానంలో ఉన్నారు.

Story first published: Monday, March 19, 2018, 14:11 [IST]
Other articles published on Mar 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+