For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

8000 ODI runs:ఢిల్లీ వన్డేలో రోహిత్ శర్మ ఖాతాలో మరో మైలురాయి

Rohit Sharma Equals Sourav Ganguly's record | Oneindia Telugu
Rohit Sharma becomes third fastest to cross 8000 ODI runs

హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా బుధవారం జరిగిన ఐదో వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4 ఫోర్లు) వన్డేల్లో 8,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ రికార్డుని రోహిత్ శర్మ 200 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. విరాట్ కోహ్లీ కేవలం 175 ఇన్నింగ్స్‌ల్లోనే అందుకోవడం విశేషం.

అగ్రస్థానంలో కోహ్లీ

అగ్రస్థానంలో కోహ్లీ

దీంతో ఈ జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. తర్వాత రోహిత్ శర్మ, సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, మహేంద్రసింగ్ ధోని, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మహ్మద్ అజహరుద్దీన్ ఉన్నారు. భారత్ తరఫున ఇప్పటి వరకూ మొత్తం 9 మంది క్రికెటర్లు వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

అత్యంత వేగంగా 8వేల పరుగులు మైలురాయిని

అత్యంత వేగంగా 8వేల పరుగులు మైలురాయిని

మొత్తంగా వన్డేల్లో అత్యంత వేగంగా 8వేల పరుగులు మైలురాయిని అందుకున్న క్రికెటర్ల జాబితాలో కోహ్లీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. కోహ్లీ 175 ఇన్నింగ్స్‌ల్లో అందుకోగా.. దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డివిలియర్స్ 182 ఇన్నింగ్స్‌ల్లో ఆ మైలురాయిని అందుకున్నాడు.

దాదా సరసన రోహిత్ శర్మ

దాదా సరసన రోహిత్ శర్మ

ఇక, ఈ జాబితాలో 200 ఇన్నింగ్స్‌లతో సౌరవ్ గంగూలీ ఇప్పటివరకు మూడో స్థానంలో ఉండగా.. తాజాగా అతని సరసన రోహిత్ శర్మ కూడా చేరాడు. ఇదిలా ఉంటే, వరల్డ్‌కప్ ముందు ఆడిన చివరి వన్డే సిరిస్‌ను టీమిండియా చేజార్చుకుంది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 237 పరుగులు చేసి ఆలౌటైంది.

ఆఖరి వన్డేలో భారత్ ఓటమి

ఆఖరి వన్డేలో భారత్ ఓటమి

దీంతో ఆస్ట్రేలియాతో బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా వేదికగా జరిగిన ఆఖరి వన్డేలో టీమిండియా 35 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఐదు వన్డేల సిరిస్‌ను ఆస్ట్రేలియా 3-2తేడాతో కైవసం చేసుకుంది. చివరి రెండు వన్డేల్లో వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీకి విశ్రాంతినివ్వడం టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది.

రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా

రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా

ఐదు వన్డేల సిరీస్‌ను వరుసగా రెండు విజయాలతో ఆరంభించిన టీమిండియా.. ఆ తర్వాత ప్రయోగాల వెంట పరుగెత్తి చివరి మూడు వన్డేల్లోనూ ఓడిపోయింది. 273 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు సరైన ఆరంభం లభించలేదు. ఆరంభంలోనే ఓపెనర్ శిఖర్ ధావన్ (12), కెప్టెన్ విరాట్ కోహ్లి (20) పేలవంగా వికెట్లు చేజార్చుకున్నారు.

జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు

జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు

ఆ తర్వాత వచ్చిన రిషబ్ పంత్ (16), విజయ్ శంకర్ (16) కూడా నిరాశపరిచారు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (56: 89 బంతుల్లో 4 పోర్లు) హాఫ్ సెంచరీతో ఒంటరిగా పోరాడాడు. జట్టు స్కోరు 132 వద్ద రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరగా... ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (0) డకౌటయ్యాడు. 28.5 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ 132/6తో పీకల్లోతు కష్టాల్లో నిలిచింది.

కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన టీమిండియా

కీలక సమయంలో వికెట్లు కోల్పోయిన టీమిండియా

చివర్లో కేదార్ జాదవ్(44), భువనేశ్వర్ కుమార్(46)లు ఓ సమయంలో భారత్‌ గెలుపుపై ఆశలు చిగురించేలా చేశారు. అయితే, వీరిద్దరూ కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. దీంతో నిర్ణీత ఓవర్లలో 237 పరుగులకు భారత్‌ ఆలౌటైంది. దీంతో 35 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆసీస్ సిరీస్‌ను 3-2తో చేజిక్కించుకుంది.

మూడు వికెట్లు తీసిన ఆడమ్ జంపా

మూడు వికెట్లు తీసిన ఆడమ్ జంపా

ఆస్ట్రేలియా బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, కమిన్స్, రిచర్డ్స్, స్టోయిన్స్ రెండు, నాథన్ లియాన్ ఒక వికెట్ తీసుకున్నారు. అంతకముందు ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా (100: 106 బంతుల్లో 10 పోర్లు, 2 సిక్సులు) సెంచరీ, పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (52: 60 బంతుల్లో 4 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.

1
45589
Story first published: Thursday, March 14, 2019, 10:25 [IST]
Other articles published on Mar 14, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+