రోహిత్ భాయ్.. ఇట్స్ ఎ బ్రాండ్: టీ20లపై చెరగని ముద్ర: ఏ కేప్టెన్‌కూ లేని ట్రాక్ రికార్డ్

లండన్: సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో 1-0తో ముందడుగు వేసింది. టీమిండియా ప్లేయర్లు ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. బ్యాటింగ్.. బౌలింగ్‌లో సత్తా చాటారు. తొలుత బ్యాటింగ్‌లో 198 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. అనంతరం బౌలింగ్‌లో 148 పరుగులకే ప్రత్యర్థిని కట్టడి చేశారు. టెస్ట్ మ్యాచ్‌లో ఎదురైన పరాజయానికి బదులు తీర్చుకున్నట్టయింది.

కేప్టెన్‌గా..
ఈ విజయంతో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. కేప్టెన్‌గా ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్స్‌పై తనదైన ముద్ర వేశాడు. బ్రాండ్‌గా మార్చివేశాడు. ఏ కేప్టెన్ కూడా అందుకోలేని రికార్డు అది. కేప్టెన్‌గా భారత జట్టును ఇప్పటివరకు వరుసగా 13 టీ20 ఇంటర్నేషనల్స్‌ను గెలిపించాడు రోహిత్ శర్మ. రోహిత్ శర్మ కేప్టెన్సీలో 29 టీ20 ఇంటర్నేషనల్స్ ఆడిన టీమిండియా 25 మ్యాచ్‌లల్లో విజయం సాధించింది. నాలుగింట్లో మాత్రమే ఓడింది. అతని సక్సెస్ ట్రాక్ రికార్డ్ 86.20 శాతం.

2019లో దండయాత్ర షురూ..
2019 నవంబర్ 7వ తేదీన బంగ్లాదేశ్‌పై విజయం సాధించడంతో రోహిత్ శర్మ దండయాత్ర మొదలైంది. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అదే జట్టుపై 10వ తేదీన జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో గెలుపొందింది. 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌పై మూడు టీ20 మ్యాచ్‌లను గెలిచింది భారత్. ఫిబ్రవరిలో ఒకటి, నవంబర్‌లో వరుసగా మూడింట్లో విజయఢంకా మోగించింది.

ఇప్పటివరకు
ఈ ఏడాది ఫిబ్రవరిలో రోహిత్ శర్మ సారథ్యంలో వెస్టిండీస్‌పై తన దూకుడును ప్రదర్శించింది టీమిండియా. 16, 18, 20 తేదీల్లో నిర్వహించిన మూడు టీ20 మ్యాచ్‌లను కైవసం చేసుకుంది. అదే నెల శ్రీలంకపైనా ప్రతాపాన్ని చూపింది. 24, 26, 27 తేదీల్లో జరిగిన మూడు టీ20 మ్యాచ్‌లల్లో తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లన్నింటికీ కేప్టెన్ రోహిత్ శర్మే. ఇక తాజాగా సౌతాంప్టన్‌లో ఇంగ్లాండ్‌పై జరిగిన తొలి టీ20 మ్యాచ్‌పై 50 పరుగుల తేడాతో జయ కేతనం ఎగురవేసింది.

ఇంకో రెండు మ్యాచ్‌లు
ఈ సిరీస్‌లో ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలివున్నాయి. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తన దూకుడును కొనసాగిస్తుందా? లేక ఇక్కడితో ఆపేస్తుందా? అనేది తేలాల్సి ఉంది. శనివారం బర్మింగ్‌హామ్ ఎడ్జ్‌బాస్టన్ స్టేడియంలో రెండో మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ మరుసటి రోజే మూడు టీ20 కూడా ఉంటుంది. నాటింగ్‌హామ్ దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఆ తరువాత మూడు వన్డే ఇంటర్నేషనల్ సిరీస్ ఆరంభమౌతుంది ఈ రెండు జట్లు మధ్య.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications