
మంగళవారం ఇండోర్‌లో జరిగిన సిరీస్‌లోని చివరి టీ20లో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో 228పరుగుల ఛేజింగ్‌లో భారత్ పూర్తిగా తేలిపోయింది. ఇక ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్ వేసిన కగిసో రబాడ.. భారత కెప్టెన్ రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. రోహిత్ పరుగులేమీ చేయకుండా డకౌట్ అయ్యాడు.
ఇక ఈ డకౌట్‌తో రోహిత్ శర్మ తన కెరీర్లో అతి చెత్త రికార్డు నమోదు చేశాడు. మెన్స్ టీ20ల్లో రోహిత్ శర్మ 43వ సారి కేవలం సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయి వరస్ట్ రికార్డ్ నెలకొల్పాడు. టీ20 ఫార్మాట్లో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటయిన ప్లేయర్‌గా చరిత్ర నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌కు చెందిన కెవిన్ ఓబ్రెయిన్ (42) పేరిట ఉంది.
T20Iలలో సింగిల్ డిజిట్ స్కోరుకే ఎక్కువ సార్లు ఔటయినవారు:
43 - రోహిత్ శర్మ (ఇండియా)
42 - కెవిన్ ఓ'బ్రియన్ (ఐర్లాండ్)
40 - ముష్ఫికర్ రహీమ్ (బంగ్లాదేశ్)
39 - మొహమ్మద్ నబీ (ఆఫ్ఘనిస్థాన్)
37 - షాహిద్ అఫ్రిది (పాకిస్థాన్)
ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో మంగళవారం జరిగిన మూడోది మరియు చివరిదైన టీ20లో తొలుత దక్షిణాఫ్రికా 228 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసౌవ్ టీ20 ఫార్మాట్‌లో తన తొలి సెంచరీని నమోదు చేయడంతో దక్షిణాఫ్రికా స్కోరు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. తొలి రెండు మ్యాచ్‌లలో వరుసగా రెండు సార్లు డకౌట్ అయిన రోసోవ్ మూడో మ్యాచ్‌లో మాత్రం అరివీర భీకరంగా చెలరేగాడు.
కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోసోవ్ సెంచరీని చేరుకోవడానికి కేవలం మరో 21డెలివరీలు మాత్రమే తీసుకున్నాడు. దీంతో 48 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఆ తర్వాత 18.3ఓవర్లకు 178పరుగులకే ఇండియా ఆలౌటైంది. సౌతాఫ్రికా 49పరుగుల తేడాతో గెలుపొందింది.