For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడు ఫార్మాట్‌లలో తొలి 100వ మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఎవరంటే?!!

Rohit Sharma Becomes First Indian Male Cricketer Completed 100th T20Is Match || Oneindia Telugu
Rohit Sharma became the first Indian cricketer to play 100 T20 International cricket matches

హైదరాబాద్: మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టీ20 గురువారం రాజ్‌కోట్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ శర్మకు 100వ టీ20. దీంతో భారత్ తరుపున వంద అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకెక్కాడు. మరోవైపు అత్యధిక అంతర్జాతీయ టీ20లు ఆడిన రెండో బ్యాట్స్‌మన్‌గా కూడా నిలిచాడు.

అయితే మూడు ఫార్మాట్లలో తొలి వంద మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్ల జాబితా ఓసారి చూస్తే... టెస్ట్ ఫార్మాట్‌లో దిగ్గజం సునీల్‌ గవాస్కర్‌ (1984) తొలి వంద టెస్ట్ మ్యాచ్ ఆడాడు. వన్డే ఫార్మాట్‌లో మరో దిగ్గజం కపిల్‌ దేవ్‌ (1987) తొలి వంద వన్డే మ్యాచ్ ఆడగా.. టీ20లలో రోహిత్ శర్మ (2019) ఉన్నాడు. రోహిత్ కంటే ముందు పాకిస్థాన్ సీనియర్ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ (111) మాత్రమే అత్యధిక టీ20లు ఆడాడు.

రోహిత్ శర్మ 100 మ్యాచ్‌లలో 32 సగటుతో 2,533 పరుగులు సాధించాడు. పొట్టి ఫార్మాట్‌లో రోహిత్ ఇప్పటివరకు 115 సిక్సర్లు కొట్టాడు. రెండో టీ20 మ్యాచ్‌లో రోహిత్‌ ఆరు సిక్సుర్లు కొట్టడంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (37) బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇంతకుముందు ధోనీ (34) పేరిట ఈ రికార్డు ఉండేది. ధోనీ 62 ఇన్నింగ్స్‌లో 34 సిక్సర్లు బాదగా.. రోహిత్‌ కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే 37 సిక్సర్లు బాదాడు.

అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌‌మెన్ల జాబితాలో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. అన్ని ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో వెస్టిండీస్ హిట్టర్ క్రిస్ గేల్ (534) టాప్‌లో ఉండగా.. పాకిస్తాన్ హిట్టర్ షాహిద్ అఫ్రిది (476) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ (398) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

మ్యాచ్ అనంతరం రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... 'స్పిన్నర్లు పిచ్‌ను బాగా అర్థం చేసుకుని అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. గత మ్యాచ్‌ తప్పులను సరిదిద్దుకున్నాం. వికెట్‌ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌ కష్టంగా మారిపోతుందని తెలుసు. దానిని సద్వినియోగం చేసుకుని పవర్‌ప్లేలో రెచ్చిపోయాం. నేను బౌలర్లను ఎప్పుడూ తక్కువగా అంచనా వేయను. ఇన్నేళ్లుగా నాకు తెలిసిన ఒకే ఒక పని.. బ్యాట్‌ చేతిలో ఉన్నప్పుడు అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడమే. పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో బంతిని బలంగా బాదాలని నిర్ణయించుకున్నా' అని అన్నాడు.

Story first published: Friday, November 8, 2019, 15:30 [IST]
Other articles published on Nov 8, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+