ధోనీ కాదు.. పాంటింగ్ కాదు.. ఐసీసీ టోర్నమెంట్లలో అత్యుత్తమ కెప్టెన్ ఎవరు?
IND vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా తన విజయ యాత్రను కొనసాగించి న్యూజిలాండ్ ను 44 పరుగుల తేడా ఓడించింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 249 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది. గత కొన్నేళ్లుగా ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. దీని వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం కూడా ఉంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది.
దుబాయ్: ఛాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా తన విజయ యాత్రను కొనసాగించి న్యూజిలాండ్‌ను 44 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీం ఇండియా 249 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా న్యూజిలాండ్ జట్టు కేవలం 205 పరుగులకే ఆలౌట్ అయింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐసీసీ టోర్నమెంట్లలో టీం ఇండియా అద్భుతంగా రాణిస్తోంది. దీని వెనుక కెప్టెన్ రోహిత్ శర్మ హస్తం కూడా ఉంది. రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా అద్భుతంగా రాణిస్తోంది.

కెప్టెన్సీలో రోహిత్ అద్భుత రికార్డు
ఐసీసీ టోర్నమెంట్లలో కెప్టెన్ గా రోహిత్ శర్మ అద్బుతమైన రికార్డును సృష్టించాడు. అది 50 ఓవర్ల వన్డే ప్రపంచ కప్ అయినా, టీ20 ప్రపంచకప్ అయినా, ఛాంపియన్స్ ట్రోఫీ అయినా రోహిత్ కెప్టెన్సీలో టీమిండియాను ఓడించడం చాలా కష్టమని నిరూపించాడు. 2023 ప్రపంచకప్ ఫైనల్ లో టీమిండియా ఓడిపోయింది.. అయితే ఆ జట్టు 2024 ప్రపంచ కప్ ను గెలుచుకుంది. ఇది కాకుండా రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ టోర్మమెంట్లలో నాకౌట్ స్టేజ్ కు కూడా చేరుకుంది.
వెనుకబడిని ధోనీ, పాంటింగ్
రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే.. ఐసీసీ టోర్నమెంట్లలో కెప్టెన్ గా 92.8 శాతం మ్యాచ్ లను గెలిచాడు. రోహిత్ తర్వాత రెండో స్థానంలో రికీ పాంటింగ్ ఉన్నాడు. రికీ పాంటింగ్ తన కెప్టెన్సీలో ఆస్ట్రేలయా 88.3 శాతం మ్యాచ్ లను గెలిపించాడు. అయితే క్లైవ్ లాయిడ్ వెస్టిండీస్ 88.2 శాతం మ్యాచ్ లను గెలిపించాడు. ఇది కాకుండా మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో టీమిండియా 83.3 శాతం మ్యాచ్ లలో విజయం సాధించింది.
న్యూజిలాండ్ పరాజయం
మ్యాచ్ గురించి చెప్పాలంటే.. న్యూజిలాండ్ జట్టు భారత్ పై 250 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది. టీమిండియా విజయం కోసం వరుణ్ చక్రవర్తి 42 పరుగులకు 5 వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు వికెట్లు పడగొట్టాడు. అంతకు ముందు శ్రేయస్ అయ్యర్ 79 పరుగులతో రాణించడంతో టీమిండియా 249 పరుగులు చేసింది. ఇప్పుడు టీమిండియా మార్చి 4న జరిగే సెమీఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.
The winning walk like a lion of Captain Rohit Sharma after win over NZ.🦁🔥 #INDvsNZ
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 2, 2025
The greatest Captain boss @ImRo45 🐐 pic.twitter.com/hjqdnPE39C
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications