Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యువీకి మొండిచెయ్యి: రోహిత్‌ను కావాలనే పక్కనబెట్టారా?

ముంబై: తొడ కండరాల గాయం కారణం చేత టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను ఈ నెల 9 నుంచి ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌కు దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరిస్‌‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌లకు బుధవారం భారత జట్టుని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఛీప్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సభ్యులు ఎంపిక చేసిన 15 మందితో కూడిన జట్టులో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, జయంత్ యాదవ్‌లు చోటు దక్కించుకున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో చికున్‌గున్యా బారిన పడ్డ పేసర్‌ ఇషాంత శర్మ ఫిట్‌నెస్ సాధించి జట్టులో చోటు దక్కించుకున్నాడు.

అయితే గాయాల నుంచి కోలుకున్నా ఫిట్‌నెస్ సమస్యల కారణంగా లోకేశ్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌లను సెలెక్టర్లు పక్కనబెట్టారు. ఈ ముగ్గురూ తమ మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను నిరూపించుకునేందుకు కనీసం ఒక రంజీ మ్యాచ్‌ అయినా ఆడాలని సెలెక్షన్‌ కమిటీ కోరుకుంటోందని చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు.

Rohit Sharma 'badly injured', to remain out of action for six to eight weeks

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే దాదాపు రెండు నెలల పాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. 'రోహిత్‌ శర్మ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌లో పరీక్షలు చేయించుకునే అవకాశం ఉంది. అవసరమైతే అతనికి శస్త్ర చికిత్స కూడా చేయాల్సిరావచ్చు. ఈ సిరీస్‌కైతే అతణ్ని మేం పరిగణనలోకి తీసుకోవట్లేదు' అని ఎమ్మెస్కే చెప్పాడు.

భారత్-ఇంగ్లాండ్ సిరిస్: తేదీలు, వేదికలు ఖరారు

'ఒక వేళ శస్త్ర చికిత్స అవసరం లేకపోతే.. అతడు కనీసం 6-8 వారాల విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అదే శస్త్రచికిత్స జరిగితే కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది' అని ఎమ్మెస్కే ప్రసాద్ వివరించాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్ టెస్టు సిరిస్‌లో కూడా రోహిత్ శర్మ పెద్దగా రాణించలేదు.

కోల్‌కత్తాలో జరిగిన రెండో టెస్టులో మాత్రం 81 పరుగలు చేశాడు. ఆ తర్వాత జరిగిన వన్డే సిరిస్‌లో కూడా పెద్దగా రాణించలేదు. అయితే వన్డే సిరిస్ విజేతను తేల్చే విశాఖ వన్డేలో మాత్రం 70 పరుగులు సాధించి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.

అయితే టెస్టు సిరిస్‌కు దూరమైన రోహిత్ శర్మ వన్డే సిరిస్‌లోనైనా చోటు దక్కించుకుంటాడేమో చూడాలి మరి. భారత్ తరుపున 21 టెస్టు మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ 1,184 పరుగులు సాధించాడు. 153 వన్డేలాడిన రోహిత్ వన్డేల్లో అత్యధిక పరుగులు (184) సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.

యువీకి మళ్లీ మొండిచెయ్యి
ఇంగ్లాండ్‌తో జరగనున్న టెస్టు సిరిస్‌లో సెలెక్టర్లు మరోసారి యువరాజ్ సింగ్‌కు మొండిచేయి చూపించారు. జట్టులో తిరిగి చోటు సంపాదించుకునేందుకు గాను తీవ్రంగా కృషి చేస్తున్న యువరాజ్ సింగ్ ఈ సీజన్‌ రంజీ ట్రోఫీలో అద్భుతంగా రాణిస్తున్నాడు.

తాను ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు సెంచరీలు సహా 587 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఒక మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ (260) కూడా చేశాడు. అయినా కూడా అతనిపై సెలెక్టర్లు జాలి చూపలేదు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+