జడేజాకు రోహిత్ ప్రశ్న: ట్విట్టర్‌లో పేలిన జోకులు
హైదరాబాద్: డిసెంబర్ 6. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 28వ వసంతంలోకి అడుగపెట్టాడు. ఈ సందర్భంగా జట్టు సహచరులతో పాటు అభిమానులు జడేజాకు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే టీమిండియా ఆటగాడు రోహిత్ శర్మతో పాటు ఓ అభిమాని పోస్టు చేసిన ట్వీట్ మాత్రం ఆసక్తిని రేకిస్తోంది.
జడేజా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రోహిత్ శర్మ ప్రపంచం మొత్తానికి నీ నిజమైన పుట్టిన రోజు ఏదో చెప్పాలంటూ ట్వీట్ పోస్టు చేశాడు. 'జడ్డుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రపంచానికి నీ నిజమైన వయసు చెప్పు. వాళ్లంతా 28 అనుకుంటున్నారు' అని సరదాగా ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మ ట్వీట్‌కు చాలా మంది అభిమానులు స్పందించారు. ఇక, జడేజా ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు జట్టులో చక్కగా రాణిస్తున్నాడు. డిసెంబర్ 8 (గురువారం) నుంచి ముంబైలోని వాంఖడే మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ప్రారంభం కానుంది.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్‌పై 2-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. గాయం కారణంగా గత నెలలో సర్జరీ చేయించుకున్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరిస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ ట్వీట్‌కు పలువురి స్పందన ఇలా ఉంది:
రోహిత్ శర్మ
జడేజా పుట్టినరోజు సందర్భంగా నిజమైన వయసు చెప్పాలంటూ రోహిత్ శర్మ ఆటపట్టించాడు.
దేవేంద్ర పాండే
తాను ఎన్నో సార్లు క్రికెటర్ల పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినా వారి స్పందన లేదని వాపోయాడు.
ఓ అభిమాని
ఓ అభిమాని అటు రోహిత్ శర్మతో పాటు రవీంద్ర జడేజాని కూడా ఆటపట్టించాడు.
జడేజా వయసు 34?
జడేజా వయసు 34 ఏళ్లు ఉండొచ్చు. ఇది కేవలం తన ఊహా మాత్రమే అని తెలిపాడు.
నీ వయసెంత: రోహిత్‌కు ఓ అభిమాని ప్రశ్న
జడేజా నిజమైన వయసెంతో చెప్పాలని ప్రశ్నించిన రోహిత్ శర్మను ఓ అభిమాని నీ వయసెంత అని ప్రశ్నించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications