
టీ20 వరల్డ్ కప్ 2022లో భాగంగా సిడ్నీలో ఇండియా, నెదర్లాండ్స్ మధ్య సూపర్-12 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో 3 ఓవర్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఔటయ్యాడు. వాన్ మీకెరెన్ బౌలింగ్ లో రాహుల్ ఎల్భీగా పెవిలియన్ చేరాడు. దీనిపై రివ్యూ తీసుకోవాలా వద్దా అన్న సందేహంలో ఉన్నాడు. ఇలోపు నాన్ స్ట్రైక్ ఎండ్ లో ఉన్న రోహిత్ శర్మ వివరించేలోగా రాహుల్ పెవిలియన్ వైపు నడిచాడు. అయితే ఆ బంతి వికెట్ల తాకలేదని రిప్లేలో తేలింది. దీంతో కేఎల్ రాహుల్ అనవసరంగా ఔటయ్యాడు. రాహుల్ 12 బంతుల్లో 1 ఫోర్ తో 9 పరుగులు చేశాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా భారత్ ఆదివారం పాకిస్థాన్ తో జరిగిన ఉత్కంఠ పోరులో విజయం సాధించింది.ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. పాక్ ఓపెనర్లను హర్ష్ దీప్ త్వరగానే పెవిలియన్ చేర్చాడు. కానీ ఆ తర్వాత వచ్చిన షాన్ మసూద్, ఇఫ్తికార్ జట్టును ఆదుకున్నారు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు. ఇఫ్తికా అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. చివర్లో షహీన్ షా అఫ్రిదీ 8 బంతుల్లో 16 పరుగులు చేశాడు.
160 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహల్ తక్కువ స్కోర్లకే ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ 15 పరుగులకే పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్ లో ముందొచ్చిన అక్షర్ పటేల్ రనౌట్ అయ్యాడు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. కానీ వేగంగా ఆడే క్రమంలో హార్దిక్ పాండ్యా ఔటయ్యాడు. కానీ కోహ్లీ ఒంటి చేతితో మ్యాచ్ ను గెలిపించాడు. కోహ్లీ 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.