Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: లార్డ్స్ వేదికగా చరిత్ర సృష్టించిన రో-కో జోడి!

IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నిర్ణయాత్మక మూడో వన్డే లార్డ్స్ స్టేడియం వేదికగా జరుగుతోంది. ఈ కీలకమైన మ్యాచ్‌లో భారత జట్టుకు చెందిన ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్టేడియంలోకి అడుగుపెట్టిన వెంటనే చరిత్ర సృష్టించారు. రోహిత్-విరాట్ జోడి భారత క్రికెట్ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది.

చేతికి నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపకోలేరు!

చేతికి నల్లటి రిబ్బన్లతో బరిలోకి దిగిన భారత జట్టు.. కారణం తెలిస్తే కన్నీళ్లు ఆపకోలేరు!

400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి భారతీయ జోడి
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి 400 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన తొలి భారత జోడిగా నిలిచారు. లార్డ్స్ వేదికగా జరిగిన వన్డేలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీమిండియా తరఫున తమ 400వ అంతర్జాతీయ మ్యాచ్‌ను పూర్తి చేసుకున్నారు. ఇంతకు ముందు ఏ భారత జోడీ కూడా కలిసి ఇన్ని మ్యాచ్‌లు ఆడలేదు.

Rohit Sharma and Virat Kohli Create History in India vs England 3rd ODI Match Play 400th International Match Together

సచిన్, ద్రవిడ్ జోడి రికార్డు ఇప్పటికే బ్రేక్
భారత్ తరఫున కలిసి అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన రికార్డు ఇప్పటికే రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ జోడీ పేరిట ఉంది. కలిసి 391 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌లను రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అధిగమించారు. మరోవైపు రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ కలిసి 369 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడారు.

కుమార సంగక్కర, మహేల జయవర్ధనే రికార్డు
ప్రపంచ క్రికెట్‌లో అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జోడీగా శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర, మహేల జయవర్ధనే రికార్డు సృష్టించారు. సంగక్కర, జయవర్ధనే కలిసి 550 మ్యాచ్‌లు ఆడారు. 426 మ్యాచ్‌లతో మహేల జయవర్ధనే, తిలకరత్నే దిల్షాన్ రెండో స్థానంలో ఉన్నారు.

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!

IND vs ENG: టాస్ ఓడిన టీమిండియాకు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ దూరం!
<strong style=18 ఏళ్లుగా కలిసి ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ" width="200" height="113">

18 ఏళ్లుగా కలిసి ఆడుతున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ

రోహిత్ శర్మ 2007లో భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. విరాట్ కోహ్లీ 2008లో అరంగేట్రం చేశాడు. వీరు గత 18 ఏళ్లుగా కలిసి ఆడుతూ తమ అద్భుతమైన బ్యాటింగ్‌‌తో జట్టును ఎన్నో చారిత్రాత్మక విజయాల వైపు నడిపించారు. వీరిద్దరూ కలిసి భారత్ రెండు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని, ఒకసారి టీ20 ప్రపంచ కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించారు.

టెస్టులు, టీ20ల నుంచి రిటైర్ అయిన రో-కో జోడీ
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఇద్దరూ టెస్ట్, టీ20 అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వారు భారత్ తరఫున కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే ఆడుతున్నారు. వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వరుసగా భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన వారిలో రెండో, మూడో స్థానాల్లో ఉన్నారు. విరాట్ 14,867 పరుగులు చేయగా.. రోహిత్ 11,757 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ ఇద్దరు దిగ్గజాలు 2027 వన్డే ప్రపంచ కప్‌లో కలిసి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Story first published: Sunday, July 19, 2026, 18:27 [IST]
Other articles published on Jul 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+