Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ChampionsTrophy: 'నువ్వు ఓ 9 సార్లు ఆడావా.. నన్నైతే 17 సార్లు పిలిచారు బాబూ..'

ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా సిద్ధమైంది. తమ తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఈనెల 20న దుబాయ్‌ వేదికగా పోటీ పడనుంది. ఈ సందర్భంగా తమ కొత్త జెర్సీలను ఆవిష్కరించింది బీసీసీఐ. భారత ఆటగాళ్లు మెగా సమరానికి సిద్ధమంటూ తమ కొత్త జెర్సీలు ధరించి ఫొటోషూట్ కు పోజులిచ్చారు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, రవీంద్ర జడేజా, విరాట్‌ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్ రాహుల్, మహమ్మద్‌ షమీ తదితరులు కొత్త జెర్సీలతో సందడి చేశారు. ఈ నేపథ్యంలో ఫొటోషూట్ కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ - రవీంద్ర జడేజా సరదాగా చిట్ చాట్ సెషన్ నిర్వహించారు. ఇద్దరు ఫొటోషూట్ కోసం వెళ్లేముందు కారులో ప్రయాణిస్తూ.. కాసేపు తమ వరల్డ్ కప్ జర్నీని గుర్తుచేసుకున్నారు.

Rohit Sharma and Ravindra Jadeja Talk on ICC Events Ahead of Champions Trophy Photoshoot

'ఇప్పుడు మేం ఫొటోషూట్ కోసం వెళ్తున్నాం. ఎంతో ఎక్సైటింగ్ గా ఉంది. ఫొటోస్ మంచిగా వచ్చాయి. ఎక్ దమ్ ఫొటోజెనిక్ గా వచ్చాయి.' అని జడేజా అనగా... ఆ తర్వాత రోహిత్ తాను ఎన్ని ఐసీసీ టోర్నీల్లో ఆడాడో తెలిపాడు. "ఇది నాది 15వది అనుకుంటా. 9 టీ20 వరల్డ్ కప్, 3 వన్డే వరల్డ్ కప్, 2 ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంకా 2 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, ఇక ఇప్పుడు మరో ఛాంపియన్స్ ట్రోఫీ. మొత్తం 15 కాదు.. 17 సార్లు నన్ను ఈ టోర్నీ కోసం ఆహ్వానించారు." అంటూ సరదాగా నవ్వించాడు.

Take a Poll

ఇంకా జడేజా ఎన్ని సార్లు ఐసీసీ టోర్నీల్లో పాల్గొన్నాడో కూడా తెలిపాడు హిట్ మ్యాన్. 'నువ్వు 9 టీ20 వరల్డ్ కప్ లు ఆడావు కదా' అని అన్నాడు. దానికి జడ్డూ.. తాను 2007, 2012 టీ20 ప్రపంచకప్ ఆడలేదని స్పష్టత ఇచ్చాడు. అనంతరం ఫొటోషూట్ లో టీమిండియా ఆటగాళ్లంతా ఫొటోలకు పోజులిస్తూ.. బ్యాట్లపై తమ ఆటోగ్రఫ్ లను ఇచ్చారు.

Story first published: Tuesday, February 18, 2025, 12:07 [IST]
Other articles published on Feb 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+