For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాపై వేటు అలవాటుగా మారింది: షమి (Video)

జట్టులో తన స్థానానికి గ్యారెంటీ లేకపోవడం గురించి టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల జరిగిన సియెట్ క్రికెట్ అవార్డులు ప్రదానోత్సవంలో షమికి వన్డే బౌలర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కిన విషయం తెలిసిందే. ఈ అవార్డు అందుకునే క్రమంలో యాంకర్ మయంతి లాంగర్ అడిగిన ప్రశ్నకు షమి ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.

2023 వన్డే వరల్డ్ కప్‌లో భారత తుది జట్టు నుంచి తప్పించినప్పుడు ఎలా ఫీలయ్యారని మయంతి షమిని ప్రశ్నించింది. వన్డే ప్రపంచకప్-2023లో షమి అత్యధిక వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా నిలిచాడు. కానీ భారత్ ఆడిన అన్ని మ్యాచ్‌ల్లో షమికి అవకాశం దక్కలేదు. 11 మ్యాచ్‌ల్లో ఏడింట్లోనే ఆడే అవకాశం దక్కించుకున్న షమి 24 వికెట్లతో చెలరేగాడు.

Rohit Sharma and Rahul Dravid in Splits as Mohammed Shami Trolls Them for Dropping Him

అయితే టీమిండియా తుది జట్టులో చోటు కోల్పోవడంపై షమి ఫన్నీగా సమాధానం ఇచ్చాడు. తనపై వేటు అలవాటు అయిపోయిందని అన్నాడు. ''అది అలవాటు అయిపోయింది. 2023 మాత్రమే కాదు, 2015, 2019 వన్డే ప్రపంచకప్‌ల్లోనే ఇదే పరిస్థితి. అయితే నాకు అవకాశం వచ్చిన తర్వాత, నా ప్రదర్శన చూసి తుదిజట్టులో నుంచి తప్పించాలనే ఆలోచన వాళ్లకు మళ్లీ రానందుకు దేవునికి కృతజ్ఞతలు''

''మీరు కఠోర శ్రమను చూస్తుంటారు. కానీ నేను అవకాశం కోసం సిద్ధంగా ఉంటటాను. ఇలా సిద్ధంగా ఉంటే మనల్ని మనం నిరూపించుకోగలం. లేదంటే మైదానంలో వాటర్ అందించాల్సిందే. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి'' అని షమి అన్నాడు. షమి తన పరిస్థితిని ఇలా సరదాగా చెప్పడంతో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్, యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సహా అందరి ముఖాల్లో నవ్వులు పూశాయి.

కాగా, వన్డే వరల్డ్ కప్-2023 అనంతరం షమి టీమిండియాకు దూరమైన విషయం తెలిసిందే. చీలమండల గాయానికి శస్త్రచికిత్స చేసుకోవడంతో కొన్ని నెలల పాటు షమి నడవడానికే ఇబ్బంది పడ్డాడు. క్రమంగా కోలుకున్న షమి మునపటిలా బంతులు సంధిస్తున్నాడు. బంగ్లాదేశ్ లేదా న్యూజిలాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌కు షమి తిరిగి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

అయితే ఆస్ట్రేలియా పర్యటన కోసం షమి విషయంలో బీసీసీఐ జాగ్రత్త పడుతోంది. అతను పూర్తిగా కోలుకుంటేనే బంగ్లా లేదా కివీస్ సిరీస్‌కు బరిలోకి దించాలని చూస్తోంది. ఆస్ట్రేలియా గడ్డపై షమికి మెరుగైన రికార్డు ఉన్న విషయం తెలిసిందే. ఎనిమిది టెస్టులు ఆడిన అతను 32 సగటుతో ఏకంగా 31 వికెట్లు పడగొట్టాడు. రెండు సార్లు అయిదు వికెట్లు తీశాడు. అందుకే ఆస్ట్రేలియా సిరీస్‌కు షమి విషయంలో బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది.

Story first published: Tuesday, September 3, 2024, 14:50 [IST]
Other articles published on Sep 3, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+