Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. ప్రపంచంలోనే నంబర్ వన్!

IND vs BAN: భారత్ క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమై రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గురువారం బంగ్లాదేశ్ పై టీమిండియా విజయంతో భారత జట్టు కెప్టెన్ గా 100 మ్యాచ్ లను గెలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్ లో భారత జట్టు బంగ్లాదేశ్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీనితో రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 228 పరుగులు చేసింది. అనంతరం భారత జట్టు 46.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. శుభ్‌మన్ గిల్ సెంచరీ చేయగా, రోహిత్ శర్మ 41 పరుగులు చేశాడు.

ఇప్పటివరకు నలుగురు కెప్టెన్లు మాత్రమే టీమిండియా తరఫున 100 కంటే ఎక్కువ మ్యాచ్ లను గెలిచారు. మహ్మద్ అజారుద్దీన్, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ గతంలో కెప్టెన్లుగా భారత జట్టును 100 విజయాలకు నడిపించారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ వారి కంటే మెరుగైన సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. రోహిత్ శర్మ సక్సెస్ రేటు ప్రస్తుతం 72. అజారుద్దీన్ సక్సెస్ రేటు 47.05 శాతం, ధోనీ సక్సెస్ రేటు 53.61%, విరాట్ కోహ్లీ విజయ శాతం 63.38%. రోహిత్ శర్మ సక్సెస్ రేటు వారి కంటే చాలా మెరుగ్గా ఉంది.

Rohit Sharma Achieves Mega Milestone Becomes World No 1 with Better Captaincy Record than Kohli

దీనితో పాటు ప్రపంచ స్థాయిలో అత్యంత వేగంగా 100 విజయాలు సాధించిన కెప్టెన్‌గా కూడా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. రోహిత్ రికీ పాంటింగ్ తో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ కెప్టెన్సీలో 138 మ్యాచ్‌ల్లో 100 మ్యాచ్‌లను గెలవడం ద్వారా ఈ ఘనతను సాధించాడు. రోహిత్ కెప్టెన్సీలో 33 మ్యాచ్‌ల్లో ఓడిపోయారు. మూడు మ్యాచ్ లు డ్రాగా, ఒక మ్యాచ్‌లో టైగా నిలిచారు. ఒక మ్యాచ్ సగంలోనే రద్దు చేయబడింది.

రోహిత్ శర్మ మరో ఘనత సాధించాడు. 30 ఏళ్ల తర్వాత 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను గెలిచిన తొలి కెప్టెన్‌గా కూడా ఘనత సాధించాడు. రికీ పాంటింగ్ 28 సంవత్సరాల వయస్సు నుంచి కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే, రోహిత్ శర్మ 30 ఏళ్ల తర్వాతే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి 100 విజయాలు సాధించాడు.

Story first published: Friday, February 21, 2025, 10:20 [IST]
Other articles published on Feb 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+