
22 బ్రాండ్‌లకు ప్రచారకర్త
ఈ ఆర్థిక సంవత్సరంలో టీమిండియా కొత్త టెస్ట్ ఓపెనర్ రోహిత్ శర్మ దాదాపు 55శాతం తన ఆదాయాన్ని మెరుగుపర్చుకున్నాడని మార్కెట్ నిపుణులు ఓ ప్రకటనలో తెలిపారు. రోహిత్ ప్రస్తుతం 22 బ్రాండ్‌లకు ప్రచారకర్తగా పనిచేస్తున్నాడు. 22 బ్రాండ్‌ల నుండి రోహిత్ రూ.73-75 కోట్ల వరకు అర్జిస్తున్నాడని నిపుణులు పేర్కొన్నారు.

మార్కెట్‌లో రోహిత్ పరంపర
'గత కొన్ని సంవత్సరాలుగా రోహిత్ శర్మ తన బ్రాండ్ విలువను పెంచుకుంటున్నాడు. మార్కెట్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. మైదానంలో, మార్కెట్‌లో రోహిత్ తన పరంపర కొనసాగిస్తున్నాడు' అని ఐఎమ్‌జీ రిలయన్స్ స్పాన్సర్‌షిప్ విక్రయాల విభాగ అధిపతి నిఖిల్ బార్దియా పేర్కొన్నారు. నాలుగు సంవత్సరాలుగా రోహిత్ వాణిజ్య ఒప్పందాలను బార్దియా చూసుకుంటున్నారు.

రోజుకు 1కోటి రూపాయలు
రోహిత్ శర్మ సంవత్సరంలో రెండు రోజుల ఒప్పందానికి రోజుకు సుమారు 1కోటి రూపాయలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. అత్యధిక పారితోషికం తీసుకునే కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రోహిత్ కంటే దాదాపు 3-4 రెట్లు ఎక్కువ వసూలు చేస్తాడట. ఇంగ్లాండ్‌లో జరిగిన ఐసీసీ ప్రపంచకప్ తర్వాత రోహిత్ బ్రాండ్ విలువ ఒక్కసారిగా పెరిగింది. ప్రపంచకప్‌లో రోహిత్ ఐదు శతకాలు బాదిన విషయం తెలిసిందే.

కోహ్లీ, ధోనీ తర్వాత
ఇటీవలే సుదీర్ఘ ఫార్మాట్‌లో కూడా ఓపెనర్‌గా చెలరేగడంతో.. మార్కెట్‌లో ప్రచారకర్తగా 'హిట్‌మ్యాన్' రోహిత్ తన జోరును పెంచాడు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 కొత్త బ్రాండ్‌లతో ఒప్పందం చేసుకున్నాడు. ప్రచారకర్తగా ఎక్కువ ఆదాయం అర్జించడంలో విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే రోహిత్ కంటే ముందున్నారు.


Click it and Unblock the Notifications












