
84 పరుగుల దూరంలో:
ఇప్పటికే టీ20ల్లో అత్యధిక పరుగులు, సెంచరీలు, సిక్సర్లు బాదిన ఆటగాడిగా 'హిట్‌మ్యాన్' రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఇక టీ20 ఫార్మాట్‌లో దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించడానికి 84 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రస్తుతం 424 పరుగులతో న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ దక్షిణాఫ్రికాపై అత్యధిక పరుగుల చేసిన ఆటగాడిగా రికార్డుల్లో ఉన్నాడు. రోహిత్ 340 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. రోహిత్ ఫామ్ చూస్తే ఈ టీ20 సిరీస్‌లో గప్తిల్ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఉంది.

దక్షిణాఫ్రికాదే పైచేయి:
2015లో భారత్ పర్యటనకు వచ్చిన దక్షిణాఫ్రికా 2-0తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. స్వదేశంలో ఇప్పటివరకు సఫారీలతో టీమిండియా 6 టీ20ల్లో తలపడగా.. కేవలం రెండు విజయాలు మాత్రమే నమోదు చేసింది. టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటివరకు 13 టీ20 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎనమిది మ్యాచ్‌లో భారత్ విజయం సాధించగా.. ఐదు మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలిచింది.

టీ20ల్లో 2,422 పరుగులు:
2015లో ఇక్కడ ఇదే దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ సెంచరీ చేసాడు. కానీ.. భారత్ విధించిన 200 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా తేలిగ్గానే ఛేదించింది. 96 టీ20లు ఆడిన రోహిత్ శర్మ 2,422 పరుగులు బాదాడు. దీనిలో నాలుగు శతకాలు ఉన్నాయి. 17 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోర్ 118.

వరుణుడి ముప్పు:
శనివారం చిరు జల్లులు కురవడంతో పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఇక ఆదివారం కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. ఆదివారం మధ్యాహ్నం చిరుజల్లులు కురిసే అవకాశం 50 శాతం ఉందని తెలిసింది. అయితే సాయంత్రం వరుణుడి ముప్పు తక్కువగా ఉంటుందని సమాచారం అందుతోంది. మ్యాచ్ సమయానికి వర్షం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అంటోంది.


Click it and Unblock the Notifications
