For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ నెం.1 కావాలంటే 69 పరుగులు కావాలంతే!!

India vs West Indies 2018 : Rohit Sharma Eyes Unique Record For Indians Across Formats | Oneindia
Rohit Sharma 1st man to score 4 T20I hundreds, 2nd highest run-scorer in history

హైదరాబాద్: వెస్టిండీస్‌తో రెండో టీ20తో రోహిత్ మరిన్ని రికార్డులు కొల్లగొట్టాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాళ్లలో రోహిత్‌నే టాప్. ఆ మ్యాచ్‌తో ముందు టీ20ల్లో ఇప్పటికే సెంచరీలు పూర్తిచేసుకొని నూతన రికార్డు నెలకొల్పిన రోహిత్‌ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. చెన్నై వేదికగా ఆదివారం విండీస్‌తో జరగనున్న ఆఖరి టీ20లో రోహిత్‌‌ మరో 69పరుగులు సాధిస్తే.. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించనున్నాడు.

రెండో టీ20తో కోహ్లీని దాటేసిన రోహిత్:

రెండో టీ20తో కోహ్లీని దాటేసిన రోహిత్:

రెండో టీ20కి ముందు టీ20ల్లోనూ కోహ్లీయే టాప్‌గా ఉన్నాడు. భారత్ తరపున విరాట్ కోహ్లీ 62 మ్యాచ్‌ల్లో మొత్తం 2102 పరుగులు చేశాడు. ఇక, రోహిత్ శర్మ విషయానికి వస్తే కోహ్లీని దాటేసి 2203 పరుగులతో తొలి స్థానాన్ని దక్కించుకున్నాడు. 11 పరుగులు దూరంలో ఉన్న కోహ్లీ రికార్డును రోహిత్ రెండో టీ20లో బద్దలు కొట్టాడు. అయితే రోహిత్‌ శర్మ 86 మ్యాచ్‌ల్లో ఈ పరుగులు సాధిస్తే కోహ్లీ మాత్రం 62 ఇన్నింగ్స్‌ల్లోనే సాధించడం విశేషం.

69 పరుగుల దూరంలో టాప్ 1:

69 పరుగుల దూరంలో టాప్ 1:

ఇప్పటివరకు అంతర్జాతీయంగా టీ20 ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌గా న్యూజిలాండ్‌ క్రికెటర్‌ మార్టిన్‌ గఫ్తిల్‌(2271) అందరికంటే ముందు ఉన్నాడు. అతని తర్వాత 2203పరుగులతో రోహిత్‌ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అంటే టీ20ల్లో గఫ్తిల్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానాన్ని చేరుకోవాలంటే.. విండీస్‌తో ఆఖరి టీ20లో మరో 69పరుగులు చేయాల్సి ఉంది.

చెన్నైలో కాకపోతే ఆస్ట్రేలియాలోనే:

చెన్నైలో కాకపోతే ఆస్ట్రేలియాలోనే:

ప్రస్తుతం ఫుల్‌ ఫామ్‌లో ఉన్న రోహిత్‌కు 69పరుగులు చేయడం పెద్ద విషయమేమీ కాకపోవచ్చు. ఒకవేళ చెన్నై మ్యాచ్‌లో రోహిత్‌ తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరుకుంటే... అతనికి నవంబరు 21నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ రూపంలో మరో అవకాశం ఉంది. అదికాకుండా.. విండీస్‌తో మ్యాచ్‌లోనే రోహిత్‌ ఈ రికార్డు సాధిస్తే క్రికెట్‌ చరిత్రలో మూడు ఫార్మాట్‌(టీ20, వన్డే, టెస్టు)లలోనూ అగ్రస్థానంలో ఉండేది భారతీయులే.

రోహిత్ కొడితే మాత్రం 3 ఫార్మాట్లలోనూ మనమే:

రోహిత్ కొడితే మాత్రం 3 ఫార్మాట్లలోనూ మనమే:

ఇప్పటివరకు టెస్టుల్లో గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్‌(15921పరుగులతో) అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వన్డేల్లోనూ సచినే(18426పరుగులతో) అందరికంటే ముందున్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్‌ 69పరుగులు సాధిస్తే మాత్రం మొత్తంగా మూడు ఫార్మాట్‌లలోనూ భారతీయులే అగ్రస్థానంలో ఉన్నట్లు అవుతుంది.

Story first published: Friday, November 9, 2018, 17:19 [IST]
Other articles published on Nov 9, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+