
ఎన్ని అవకాశాలైనా ఇస్తాం..
అగ్నికి ఆజ్యం పోసినట్లు.. ఈ సిరీస్‌లో చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జట్టులో వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను సెలెక్టర్లు తొలగించారు. దీంతో మూడో టెస్టులో అతన్ని ఆడించడం లేదని, గిల్‌ను జట్టులోకి తీసుకోవడానికే రాహుల్‌ను ఈ పదవి నుంచి తప్పించారని వార్తలు గుప్పుమన్నాయి.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై రోహిత్ క్లారిటీ ఇచ్చేశాడు. 'ఎవరైనా ఆటగాడు ఫామ్‌లో లేక కష్టాల్లో ఉన్నప్పుడు.. అతనిలో ఉన్న సత్తాను బట్టి అవకాశాలు ఇస్తాం. తమ సత్తా నిరూపించుకునే సమయం వాళ్లకు ఇవ్వాలి' అని రోహిత్ తేల్చేశాడు.

వైస్ కెప్టెన్ కాకపోతే ఏమైంది?
మూడో టెస్టుకు ముందు నెట్స్‌లో గిల్ సుదీర్ఘ సమయం ప్రాక్టీస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. రాహుల్‌ను పక్కన పెడుతున్నారని, అందుకే గిల్ ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. వీటిపై కూడా రోహిత్ స్పందించాడు. 'వైస్ కెప్టెన్‌గా ఉన్నా, లేకపోయినా ఆటగాడి స్థాయిలో ఎలాంటి మార్పు ఉండదు.
ఆ పోస్టు మనకు ఏం చెప్పదు. అతను వైస్ కెప్టెన్‌గా ఉన్నాడంటే అప్పటికి జట్టులో అతనే అందరి కన్నా సీనియర్ అయ్యుంటాడు. ఇప్పుడు ఆ పోస్టు తీసేసినా ఏమీ మారదు. ఇక గిల్, కేఎల్ గురించి మాట్లాడుకుంటే.. వీళ్లిద్దరూ కూడా మ్యాచ్‌కు ముందు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. ఇది వాళ్లకు అలవాటే' అని చెప్పాడు.

ఆడే జట్టుపై నిర్ణయం అప్పుడే..
ఇక మూడో టెస్టులో ఆడే పదకొండు మంది గురించి తాము ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని రోహిత్ చెప్పాడు. టాస్ సమయంలోనే ఈ విషయంపై ఒక క్లారిటీ వస్తుందన్నాడు. 'ఇక ఆడే 11 మంది విషయానికొస్తే మేం ఇంకా ఇక నిర్ణయానికి రాలేదు. టాస్ సమయంలో దీనిపై నేను ఒక నిర్ణయం తీసుకుంటా. అప్పుడే మా జట్టు ఏదో ప్రకటిస్తాను' అని రోహిత్ స్పష్టం చేశాడు.
గతేడాది ఆరంభం నుంచి రాహుల్ అత్యంత చెత్త ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం 11 టెస్టు ఇన్నింగ్సులు ఆడిన అతను 15.90 సగటుతో 175 పరుగులు మాత్రమే చేశాడు. అందుకే అతన్ని జట్టులో నుంచి తీసేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications












