Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆమె ఇన్ స్వింగర్ డెలివరీలను ఎదుర్కోలేక షాకయ్యా.. టీమిండియా వుమెన్స్ దిగ్గజంపై రోహిత్ శర్మ ప్రశంసలు

Rohit Said that Jhulan Goswami is Once in a Generation Player, And praises Her in Swingers

భారత వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి ఇంగ్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇకపోతే రైట్ ఆర్మ్ పేసర్ అయిన ఝులన్ గోస్వామి అత్యధిక వికెట్లు తీసిన వుమెన్స్ క్రికెటర్‌గా తన ప్రస్థానం కొనసాగిస్తోంది. ఇక తన కెరీర్‌ను ముగించేందుకు రెడీ అయింది.

ఆమె తన కెరీర్లో ఇప్పటివరకు 12 టెస్టులు, 201 వన్డేలు, 68 టీ20లు ఆడింది. ఆమె ఆయా ఫార్మాట్లలో వరుసగా 44, 251, 56వికెట్లు సాధించింది. ఇక భారత మెన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ఝులన్ గోస్వామికి రిటైర్మెంట్ పరంగా హృదయపూర్వక అభినందనలు తెలిపాడు. తాను నెట్స్‌లో గోస్వామి ఇన్ స్వింగర్లను చాలా కష్టంగా ఎదుర్కొన్నానని చెప్పాడు. గోస్వామి తన అద్భుతమైన ఇన్ స్వింగ్ బౌలింగ్‌తో తనను షాక్‌కు గురిచేసే బౌలింగ్‌తో ఆకట్టుకుందని రోహిత్ చెప్పాడు.

ఛాలెంజింగ్‌గా ఉండేవి

ఛాలెంజింగ్‌గా ఉండేవి

'నేను గాయపడి ఎన్సీఏలో ఉన్న సమయంలో ఆమె కూడా అక్కడే తన పునరావాసాన్ని కొనసాగించింది. ఆమె ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా నాకు నెట్స్‌లో బౌలింగ్ చేసేది. ఆమె ఇన్ స్వింగర్ బంతులు చాలా ఛాలెంజింగ్‌గా ఉండేవి. వాటిని నేను ఎదుర్కోవడానికి కాస్త ఇబ్బందిపడేవాడిని. ఆమెతో చాలా సంభాషణ చేశాను. ఆమె నుంచి కొన్నింటిని నేను తెలుసుకున్నాను. నా ద్వారా తాను కూడా కొన్ని విషయాలు తెలుసుకుంది.' అని రోహిత్ తెలిపాడు. ఆస్ట్రేలియాతో జరగబోయే సిరీస్‌కు ముందు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఝులన్ గోస్వామి గురిం ప్రత్యేకంగా ప్రస్తావించాడు.

ఆమె కళ్లల్లో కన్పించేది

ఆమె కళ్లల్లో కన్పించేది

'నేను ఆమె ఆడుతున్నప్పుడు ఎప్పుడు చూసినా.. ఆమె దేశం కోసం ఆడటానికి ఎంత మక్కువ కనబర్చుతుందో ఆమె కళ్లల్లో కన్పిస్తుంది. ఆమె వయస్సు గురించి నేను మాట్లాడదల్చుకోలేదు. కానీ ఈ దశలోనూ ఆమె ఏమాత్రం తగ్గని రనప్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్థులకు సవాలు విసరడం నిజంగా మెచ్చుకోదగ్గది. తన ఫిట్ నెస్ ద్వారా ఆమె మనకు చాలా విషయాలను చాటి చెబుతోంది. ఆటలో ఆమెలో పట్ల ఉన్న అభిరుచి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తుంది. నేను ఆమెకు రిటైర్మెంట్ విషయం పట్ల శుభాకాంక్షలు చెప్పదల్చుకున్నాను. ఆమె తరానికి ఒక ప్లేయర్' అంటూ రోహిత్ ఝులన్

గోస్వామిని కొనియాడాడు.

పది ఓవర్లలో కేవలం 20 పరుగులే

ఇకపోతే భారత్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌‌ పర్యటనలో ఉంది. ఇక హోవ్‌లోని కౌంటీ గ్రౌండ్‌లో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో భారత జట్టు ప్లేయింగ్ 11లో గోస్వామి ఆడింది. తొలుత భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. మొదటి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి తన సత్తా ఏంటో ఝులన్ గోస్వామి చూపించింది. ఆమె తన పది ఓవర్ల కోటాలో కేవలం 20పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ పడగొట్టింది. రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఆమె వేసింది. ఆమె కట్టుదిట్టమైన బౌలింగ్ ప్రయత్నంతో ఇంగ్లాండ్ నిర్ణీత 50ఓవర్లలో కేవలం 7వికెట్లు కోల్పోయి 227పరుగులకే పరిమితమైంది.

మంధాన, హర్మన్ చెలరేగడంతో..

ఇక 228పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. స్మృతి మంధాన (91పరుగులు 99బంతుల్లో 10ఫోర్లు, 1సిక్సర్) మరోసారి ఛేజింగ్లో తన మార్క్ చూపెట్టింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. యాస్తికా భాటియాతో కలిపి మంధాన 96పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. యాస్తికా (47బంతుల్లో 50పరుగులు) కాస్త ధాటిగా ఆడింది. ఇక యాస్తికా ఔటయినప్పటికీ.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (74పరుగులు 94బంతుల్లో 7ఫోర్లు, 1సిక్సర్ నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చింది. మంధాన, హర్మన్ కలిసి 99పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు. 44.2ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి 7వికెట్ల తేడాతో గెలుపొందింది.

Story first published: Monday, September 19, 2022, 13:29 [IST]
Other articles published on Sep 19, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+