బూమ్రా ఉన్నాడుగా.. పాక్ బౌలర్‌ని నెత్తికెక్కించుకోకండి!: రోహిత్
ముంబై: పాక్ పేసర్ మహమ్మద్ అమీర్ ఓ సాధారణ బౌలర్ మాత్రమేనని, అతనిని అనవసరంగా నెత్తినెక్కించుకుంటున్నారని భారత క్రికెటర్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. అమీర్‌కు బదులు.. భారత జట్టు యువ సంచలనం జస్‌ప్రీత్ బుమ్రా గురించి మాట్లాడుకోవాలన్నాడు.
అమీర్ ఇప్పుడే వచ్చాడని, ఒక్క మ్యాచ్‌లో అతడి ప్రదర్శనను చూసి మరీ ఇంతగా పొగడాల్సిన అవసరం లేదని,కొందరైతే ఏకంగా వసీమ్ అక్రమ్‌తో అతణ్ని పోలుస్తున్నారని, అక్రమ్ సాధించిన దాంట్లో కొంతైనా సాధించాలన్నాడు. అమీర్‌కు నైపుణ్యం ఉండవచ్చునని, అయితే జట్లను కుప్పకూల్చే సామర్థ్యమేమీ లేదన్నాడు.

అతనో సాధారణ బౌలర్ అన్నాడు. ఆ రోజు అతడికి కలిసి వచ్చిందని చెప్పాడు. ఓ ఏడాదిపాటు అతణ్ని ఇలాగే బౌలింగ్ చేయనివ్వాలన్నాడు. అదే సమయంలో బుమ్రాపై ప్రశంసలు కురిపించాడు.
అతడు అరుదైన బౌలర్ అని, ఎంతో భవిష్యత్తు ఉందన్నాడు. ఆధునిక బౌలర్‌కి అవసరమైన అస్త్రాలన్నీ అతడి దగ్గరున్నాయన్నాడు. కొన్నిసార్లు కెప్టెన్‌నీ ఆశ్చర్యపరుస్తుంటాడన్నాడు. మనం అమీర్ గురించి వదిలేసి మనం బుమ్రా గురించి మాట్లాడుకోవాలన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications