Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

INDvsAUS : మరీ లావుగా కనిపిస్తున్నాడు.. రోహిత్‌పై మాజీ లెజెండ్ షాకింగ్ కామెంట్స్!

 Rohit looks overweight says Kapil dev

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరీ లావుగా ఉన్నాడట. అతని బరువు తగ్గడంపై ఫోకస్ పెడితే బాగుటుందని మాజీ లెజెండ్ కపిల్ దేవ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీసులో భారత జట్టును విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ ఫిజిక్‌పై కొన్ని ప్రశ్నలు తలెత్తాయి. అతను ఫిట్‌గా లేడని కొందరు అంటున్నారు. ఇదే విషయంపై కపిల్ దేవ్‌ను విలేకరులు ప్రశ్నించారు. ఈ సమయంలోనే ఆయన షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.

 టీవీలో లావుగా ఉన్నాడు..

టీవీలో లావుగా ఉన్నాడు..

'ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. అదీ కెప్టెన్ అయితే ఇంకా ఇంపార్టెంట్. ఫిట్‌గా లేకపోతే అదొక అవమానంగా ఉంటుంది. రోహిత్ ఈ విషయంలో కొంత కష్టపడక తప్పదు' అని కపిల్ దేవ్ అన్నాడు. రోహిత్ అద్భుతమైన బ్యాటర్ అని కొనియాడిన కపిల్ దేవ్.. ఫిట్‌నెస్ విషయంలో మాత్రం అతను మరింత చెమటోడ్చాల్సిన అవసరం ఉందన్నాడు. రోహిత్ మరీ లావుగా కనిపిస్తున్నాడని, అది కూడా టీవీలో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పేశాడు. అయితే టీవీలో చూసిన దానికి, నేరుగా ఆ వ్యక్తిని కలిసిన దానికి తేడా ఉంటుందని అంగీకరించాడు.

 ఏడాదిగా టెస్టుల్లో లేడు..

ఏడాదిగా టెస్టుల్లో లేడు..

'రోహిత్ ఒక గొప్ప ప్లేయర్, అద్భుతమైన కెప్టెన్. కానీ అతను ఫిట్‌నెస్ సాధించాల్సిన అవసరం ఉంది. విరాట్‌ను చూడండి. అతన్ని ఎప్పుడు చూసినా ఏం ఫిట్‌గా ఉన్నాడ్రా? అనుకుంటాం' అని కపిల్ చెప్పాడు. దాదాపు ఏడాది తర్వాత టెస్టు క్రికెట్ ఆడుతున్న రోహిత్ శర్మ.. ఆస్ట్రేలియాపై రాణించాడు. తొలి టెస్టులో సెంచరీతో మెరిశాడు. గతేడాది మార్చిలో శ్రీలంకతో జరిగిన టెస్టులో అతను చివరగా ఆడాడు. ఆ తర్వాత కరోనా సోకడంతో ఇంగ్లండ్‌తో టెస్టు ఆడలేదు. బంగ్లాదేశ్‌తో వన్డేల్లో గాయం అవడంతో టెస్టులకు దూరం అయ్యాడు.

సడెన్‌గా పెరిగిపోయాడు?

సడెన్‌గా పెరిగిపోయాడు?

అయితే గాయం నుంచి కోలుకున్న తర్వాత అతను కొంత ఫిట్‌గానే కనిపించాడు. చాలా వరకు బరువు తగ్గినట్లు అభిమానులు గుర్తించాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మొదలవడానికి ముందు నుంచి మళ్లీ అతను బరువు పెరుగుతున్నట్లు అనిపించింది. రెండో టెస్టులో అతన్ని చూస్తే.. అంతకుముందు శ్రీలంకతో వన్డే సిరీస్‌లో చూసింది ఇతనేనా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. మళ్లీ బరువు చేసినట్లు కనిపించడంతో చాలా మంది మరోసారి అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలోనే కపిల్ దేవ్ కూడా ఈ వ్యాఖ్యలు చేశాడు. మరి రోహిత్ ఈ విషయంపై ఫోకస్ పెట్టి మళ్లీ బరువు తగ్గుతాడేమో చూడాలి.

Story first published: Thursday, February 23, 2023, 15:25 [IST]
Other articles published on Feb 23, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+