Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రో-కో విధ్వంసం: దక్షిణాఫ్రికా ముందు భారీ లక్ష్యం

రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత బ్యాటర్లు తమ సత్తా చాటారు. భారత బ్యాటర్ల అద్భుత ఇన్నింగ్స్ కారణంగా భారీ స్కోరు చేయగలిగారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికాకు 350 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కింగ్ కోహ్లీ(135) సూపర్ సెంచరీ, రోహిత్ శర్మ(57), కేఎల్ రాహుల్(60), రవీంద్ర జడేజా(32) రాణించడంతో భారత్ భారీ స్కోరు సాధించగలిగింది. విరాట్ కోహ్లీ 120 బంతుల్లో 135 పరుగులు బాదగా.. రోహిత్ శర్మ, కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్థశతకాలు చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది.

టీమిండియా ఇన్నింగ్స్ లో 25 పరుగుల వద్ద యశస్వీ జైస్వాల్ ఔట్ కాగా.. అనంతరం వచ్చిన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడాడు. రోహిత్, విరాట్ కోహ్లీ నువ్వా నేనా అన్నట్లు అద్భుతంగా ఆడారు. ఈ క్రమంలో హిట్ మ్యాన్ రోహిత్ 57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 134 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ ఔటైన తర్వాత కూడా విరాట్ కోహ్లీ నిలకడగా ఆడి సెంచరీ సాధించాడు. 120 బంతుల్లో 7 సిక్సర్లు, 11 ఫోర్లతో 135 పరుగులు చేసి ఔటయ్యాడు.

Rohit Kohli Carnage India Set Massive 350-Run Target Against South Africa in Ranchi

చివరి ఓవర్లలో రాహుల్-జడేజా జోరు టీమిండియాకు కలిసొచ్చింది. మధ్య ఓవర్లలో దక్షిణాఫ్రికా బౌలర్లు కొంత పుంజుకుని వికెట్లు తీసినప్పటికీ.. చివర్లో కేఎల్ రాహుల్ (56 బంతుల్లో 60), రవీంద్ర జడేజా (20 బంతుల్లో 32) అందించిన మెరుపు ఇన్నింగ్స్‌లు భారత్‌ను దాదాపు 350 పరుగుల మార్కుకు దగ్గరగా చేర్చాయి. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్, బార్ట్‌మెన్ రెండేసి వికెట్లు తీశారు. మార్కో జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, November 30, 2025, 17:52 [IST]
Other articles published on Nov 30, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+