న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసీస్ మీద భారత్ రికార్డ్.. తొలి నాలుగు మనవే, అలాగే కెప్టెన్‌గా రోహిత్ ఖాతాలో ఓ రికార్డు

Rohit Creates One Record as Indias Captain, and Teamindia highest Run Chases Against Aussies

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టీ20 సిరీస్లోని డిసైడర్ అయిన మూడో టీ20మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రసవత్తరంగా సాగింది. చివరి ఓవర్ వరకు మ్యాచ్ టఫ్ అండ్ టఫ్ వచ్చింది. చివరి ఓవర్లో 11పరుగులు అవసరమైన దశలో కోహ్లీ తొలి బంతికి సిక్స్ కొట్టడం, అయిదో బంతికి హార్దిక్ ఫోర్ బాదడంతో విజయం ఖాయమైంది. ఈ విజయంతో ఆస్ట్రేలియాపై భారత్ 2-1తేడాతో సిరీస్ గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్ విజయం ద్వారా భారత్ విజయాల్లో పలు రికార్డులను నమోదు చేసింది.

ఆసీస్ మీద అత్యధిక సార్లు హయ్యెస్ట్ ఛేజింగ్స్

ఆసీస్ మీద అత్యధిక సార్లు హయ్యెస్ట్ ఛేజింగ్స్

ఆస్ట్రేలియాపై 187పరుగుల ఛేదన చేసి భారత్ ఈ మ్యాచ్ గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే ఆస్ట్రేలియా మీద అత్యధిక సార్లు (నాలుగుసార్లు) టీ20ల్లో హయ్యస్ట్ ఛేజింగ్స్ చేసిన జట్టుగా భారత్ రికార్డు నెలకొల్పింది. ఇక తాజా ఛేదన.. ఆసీస్ మీద నాలుగో అత్యుత్తమ ఛేదన. అంతకుముందు ఆసీస్ మీద మూడుసార్లు అత్యధిక పరుగులను ఛేజింగ్ చేసిన జట్టు కూడా ఇండియానే కావడం విశేషం.

ఆస్ట్రేలియాపై అత్యధిక ఛేజింగ్స్

ఆస్ట్రేలియాపై అత్యధిక ఛేజింగ్స్

1. 2013లో రాజ్ కోట్‌లో ఇండియా 202పరుగులను ఛేదించింది.

2. 2016లో సిడ్నీలో ఇండియా 198పరుగులను ఛేదించింది.

3. 2020లో సిడ్నీలో ఇండియా 195పరుగులను ఛేదించింది.

4. తాజాగా 2022లో హైదరాబాద్‌లో 187 పరుగులను భారత్ ఛేదించింది.

5. 2018లో హరారే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ విధించిన 184పరుగుల లక్ష్యాన్ని పాక్ ఛేదించింది.

 విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ

విరాట్ కోహ్లీని దాటేసిన రోహిత్ శర్మ

ఇకపోతే 2021నుంచి టీ20ల్లో ఇప్పటివరకు భారత్ 14 మ్యాచ్‌ల్లో ఛేదనకు దిగింది. ఆ 14 మ్యాచ్‌లలో 13సార్లు ఇండియా గెలుపొందింది. కేవలం ఒక్కసారి మాత్రమే ఓటమి పాలయింది. అలాగే భారత్‌కు టీ20ల్లో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ల లిస్టులో రోహిత్ రెండో స్థానానికి ఎగబాకాడు. అతను ఈ విషయంలో విరాట్ కోహ్లీని అధిగమించాడు. ఇక 42విజయాలతో తొలి స్థానంలో ధోనీ ఉండగా, 33విజయాలతో రోహిత్ శర్మ రెండో స్థానంలో, 32విజయాలతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

Story first published: Monday, September 26, 2022, 11:06 [IST]
Other articles published on Sep 26, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X