Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Tilak Verma: రోహిత్ భాయ్ ఆ టైంలో ఎలా ఆడాలో నేర్పించాడు

Rohit Bhai Helped Me and Taugh me How to Play under Pressure says Tilak Verma

ముంబై ఇండియన్స్ యువ ఆటగాడు, తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.. రోహిత్ శర్మ తనకు చాలా సపోర్ట్‌గా నిలిచాడని పేర్కొన్నాడు. తనతో రోహిత్ చాలా సార్లు సంభాషించాడని, ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో రోహిత్ నేర్పించాడని చెప్పాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ ఈ ఏడాది పేలవ సీజన్‌ను ఎదుర్కొంది. పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఇకపోతే తిలక్ వర్మ 14మ్యాచ్‌ల్లో 36.0 సగటుతో 397పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ తర్వాత ముంబై టీంకి అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడుగా నిలిచాడు.

ఇక రోహిత్ శర్మను 19ఏళ్ల తిలక్ వర్మ బాగా ఆకట్టుకున్నాడు. ఆ మధ్య రోహిత్ మాట్లాడుతూ.. త్వరలో మూడు ఫార్మాట్లలో తిలక్ వర్మ దేశానికి ప్రాతినిధ్యం వహించేలా ఎదగగలడని పేర్కొన్నాడు. ఇక తిలక్ వర్మ మాట్లాడుతూ.. 'వ్యక్తిగతంగా నేను నా బ్యాటింగ్‌ను ఎలా మెరుగుపరుచుకోవాలో రోహిత్ భాయ్‌తో చాలా సార్లు మాట్లాడాను. ఈ సీజన్‌లో నేను బాగా రాణించగలిగాను. అందులో రోహిత్ సపోర్ట్ కూడా ఉంది. జట్టు కోసం ఎప్పుడూ బాగా రాణించడమే, నాతో సాధ్యమయ్యే మ్యాచ్‌లను గెలిపించగలగడమే నా ఆలోచనా విధానంగా మారిపోయింది.' అని తిలక్ వర్మ అన్నాడు.

ఇంకా మాట్లాడుతూ.. 'నేను ఫినిష్ చేయలేకపోయిన కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ భాయ్ నాతో మాట్లాడాడు. నిన్ను నువ్వు బ్యాకప్ చేసుకో.. నీ గత మ్యాచ్ అనుభవాలను గ్రహించు.. అని సూచించాడు. దాంతో నేను క్రీజులో దిగే టైంలో పరిస్థితులను బాగా అర్థం చేసుకునేవాడిని.. అది నాకు ఎలా ఆడాలో ఆటోమేటిక్‌గా నేర్పించగలిగింది. ఒత్తిడి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో చెప్పడమే కాకుండా.. ఆటను ఎలా ఆస్వాదించాలో కూడా నాకు రోహిత్ భాయ్ నేర్పించాడు. అది నాకు చాలా హెల్ప్ చేసింది' అని వర్మ తెలిపాడు.

Story first published: Wednesday, July 20, 2022, 22:52 [IST]
Other articles published on Jul 20, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+