కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై రోహిత్, గంగూలీ షాకింగ్ కామెంట్స్

టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి తన అభిమానులందరినీ విరాట్ కోహ్లీ తీవ్ర మనో వేదనలోకి నెట్టేశాడు. కేవలం కోహ్లీ అభిమానులకే కాకుండా క్రికెట్ అభిమానులందరికీ ఈ నిర్ణయం మింగుడు పడడం లేదు. దీంతో కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం కీడా అభిమానులతోపాటు ప్రముఖ ఆటగాళ్లు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై స్పందించారు.
గంగూలీ కామెంట్స్
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం అది అతని వ్యక్తిగత నిర్ణయమని చెప్పుకొచ్చారు. అయితే కోహ్లీ నిర్ణయాన్ని బీసీసీఐ గౌరవిస్తుందని తెలిపారు.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత క్రికెట్ జట్టు అన్ని ఫార్మాట్లలో అద్బుత విజయాలు సాధించిందని ఈ సందర్భంగా దాదా కొనియాడారు. జట్టులో కోహ్లీ కీలక సభ్యుడని చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు.. భవిష్యత్‌లో టీమిండియా ఉన్నత శిఖరాలు అందుకోవడంతో తన వంతు పాత్ర పోషిస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా విరాట్ కోహ్లీ గొప్ప ఆటగాడంటూ ట్విటర్ వేదికగా గంగూలీ ప్రశంసించారు.
రోహిత్ స్పందన
విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకోవడంపై టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా తప్పుకున్నాడనే వార్త విని తాను షాక్‌కు గురైయినట్టు చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ విజయవంతంగా పని చేశాడంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రాసుకొచ్చాడు. అంతేకాకుండా విరాట్‌కు ఈ సందర్భంగా హిట్‌మ్యాన్ అభినందనలు కూడా తెలిపాడు.

తీవ్ర నిరాశలో కోహ్లీ అభిమానులు
విరాట్ కోహ్లీ వన్డే, టీ20 కెప్టెన్సీకి దూరమైనప్పటికీ టెస్టు కెప్టెన్సీకి ఢోకా లేదని అంతా భావించారు. టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం ఖాయమని అనుకున్నారు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా సాధించిన విజయాలే దీనికి కారణంగా చెప్పుకొచ్చారు. కానీ సీన్ మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన నెల రోజుల్లోనే కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు.
దీంతో విరాట్ అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కొంత మంది అభిమానులైతే బీసీసీఐ పెద్దల వల్లే కోహ్లీ ఈనిర్ణయం తీసుకున్నాడని వాపోతున్నారు. సెలెక్టర్లు కోహ్లీకి కావాలనే ఈ పరిస్థితి తీసుకొచ్చారని మండిపడుతున్నారు. కాగా కొంత కాలంగా బీసీసీఐకి, కోహ్లీకి మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications