అల్లరిమూక నుంచి ఓ కుటుంబాన్ని కాపాడిన గవాస్కర్
హైదరాబాద్: 70, 80 దశకాల్లో వెస్టిండిస్ బౌలర్లపై సత్తా చాటిన మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మరో కోణాన్ని బయట పెట్టాడు అతని కుమారుడు రోహన్ గవాస్కర్. 1993లో ముంబై అల్లర్ల సందర్భంగా తండ్రిలోని అసలైన ధైర్యాన్ని చూశానని అతడు గుర్తు చేసుకున్నాడు. ముంబై జర్నలిస్టుల సంఘం సునీల్ గవాస్కర్‌ను గోల్డెన్ జూబ్లీ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో గౌరవించింది.
1993లో ముంబై అల్లర్ల సమయంలో జరిగిన ఓ సంఘటనను ఈ సందర్భంగా రోహన్ గుర్తు చేసుకున్నాడు. నాన్న ధైర్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 1993లో ముంబై పేలుళ్ల తర్వాత జరిగిన ఓ ఘటన నాపై చాలా ప్రభావమే చూపిందని రోహాన్ గవాస్కర్ పేర్కొన్నాడు.

నాన్నలో నాకు నచ్చే మరో అంశం అతని ధైర్యం
‘నాన్నలో నాకు నచ్చే మరో అంశం అతని ధైర్యం. 1993 ముంబై బాంబుపేలుళ్ల సమయంలో ఓ సంఘటన జరిగింది. ఆ సంఘటన నాపై బాగా ప్రభావం చూపింది. మేము ఆ రోజు మా మేడపై నిలుచున్నాం. అదే సమయంలో ఓ వర్గానికి చెందిన కొందరు ఓ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని దాడి చేయడానికి ప్రయత్నించారు. దీన్నంతటినీ గమనిస్తున్న నాన్న ఒక్కసారిగా వారివైపు పరిగెత్తుకుంటూ వెళ్లారు' అని రోహన్ చెప్పుకొచ్చాడు.

దీంతో వెనక్కితగ్గిన వాళ్లు ఆ కుటుంబాన్ని క్షేమంగా వెళ్లనిచ్చారు
'ఆ కుటుంబాన్ని ఏదైనా చేసే ముందు నన్ను దాటి వెళ్లండి అంటూ వారిని అడ్డుకోవడంతో ఆ కుటుంబం అక్కడి నుంచి క్షేమంగా బయటపడింది. దీంతో వెనక్కితగ్గిన వాళ్లు ఆ కుటుంబాన్ని క్షేమంగా వెళ్లనిచ్చారు. మీ ప్రాణాల్ని పణంగా పెట్టే ఇలాంటి పనులు చేయడానికి ధైర్యం కావాలి. హెల్మెట్ లేకుండా అరవీర భయంకర బౌలర్లను ఎదుర్కొన్న ధైర్యంతో ఆయన ఇలా చేసి ఉండొచ్చు. కొందరు దీనిని ధైర్యం అంటారు. మరికొందరు పిచ్చి అంటారు. కానీ నా దృష్టిలో మాత్రం అటువంటి రిస్క్ చేయడానికి ప్రత్యేకమైన ధైర్యమంటూ ఒకటుండాలి' అని రోహన్ తన తండ్రి గురించి గొప్పగా చెప్పాడు.

సునీల్ గవాస్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
ఈ కార్యక్రమంలో భాగంగా సునీల్ గవాస్కర్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు కింద ఓ వెండి జ్ఞాపికను అందజేశారు. టెస్టుల్లో అతను చేసిన 34 సెంచరీల వివరాలతో ఉన్న ఓ పత్రాన్ని కూడా బహుమతిగా ఇచ్చారు. ఈ సందర్భంగా 1971లో తొలిసారి వెస్టిండీస్ పర్యటనకు తాను వెళ్లినపుడు జరిగిన ఘటనలను సన్నీ గుర్తు చేసుకున్నాడు.

తనను టచ్ చేస్తే కలిసొస్తుందన్న ఉద్దేశంతో
మ్యాచ్‌కు వెళ్లే ముందు తనను టచ్ చేస్తే కలిసొస్తుందన్న ఉద్దేశంతో విండీస్ లెజెండ్ గ్యారీ సోబర్స్ ప్రతిరోజు తన దగ్గరికి వచ్చేవాడని గవాస్కర్ చెప్పాడు. ఇది తెలుసుకున్న అప్పటి కెప్టెన్ అజిత్ వాడేకర్, సోబర్స్‌కు దొరకకుండా తనను టాయిలెట్‌లో దాచిపెట్టిన విషయాన్నీ గవాస్కర్ ఈ సందర్భంగా వెల్లడించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications