Rohan Gavaskar: అతనికి అవకాశాలివ్వండి.. ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా అతనేంటో చూపిస్తాడు

మాజీ బ్యాటర్ రోహన్ గవాస్కర్.. శుభ్‌మాన్ గిల్‌ను ఆకాశానికెత్తేశాడు. బెంగుళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో జరిగిన శిక్షణ సెషన్‌లో అమోల్ మజుందార్.. శుభ్‌మాన్ గిల్‌ను భవిష్యత్తు స్టార్ అని గుర్తించిన విషయాన్ని గుర్తు చేశాడు. న్యూజిలాండ్‌లో జరిగిన 2018 అండర్ 19 ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును పొందిన గిల్ తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత.. అతను ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడాడు.
అక్కడ రాణించడంతో అతను 2019లో తన వన్డే అరంగేట్రం చేశాడు. గిల్ భారత్ తరపున టీ20లలో ఇప్పటి వరకు ఆడలేదు. అతను ఇప్పటికే వన్డేలలో మంచి ప్రదర్శనతో జట్టులో స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాడు. గత నెలలో హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేపై సిరీస్లో అతను వన్డేల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు.
'అమోల్ మజుందార్ గిల్ గురించి నాతో గతంలో ప్రస్తావించాడు. ఎందుకంటే అమోల్ అతన్ని ఎన్సీఏలో గమనించాడు. అప్పట్లో అమోల్ ఎన్సీఏలో కోచింగ్ పాత్రలో వర్క్ చేసేవాడు. అతను ఓసారి నా దగ్గరకు వచ్చి.. 'రోహన్ ఓ సూపర్ స్టార్ ప్లేయర్ గిల్ రూపంలో మనకు ఉన్నాడు. అతను కచ్చితంగా భారత్‌కు ఆడే ప్లేయర్. నాకు ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు' అని తనతో అమోల్ చెప్పినట్లు స్పోర్ట్స్ 18 న్యూస్ షో 'స్పోర్ట్స్ ఓవర్ ది టాప్'లో గవాస్కర్ తెలిపాడు.
ఆల్ ఫార్మాట్ ప్లేయర్‌గా ఎదిగేందుకు గిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని గవాస్కర్ తెలిపాడు. అయితే అతనికి తగినన్ని అవకాశాలు దక్కాలని పేర్కొన్నాడు. 'అతను ఆల్ ఫార్మాట్ ప్లేయర్ కాగలడు. అతను తన క్లాస్ చూపిస్తున్నాడు. అతను వైట్ బాల్ క్రికెట్‌లో అన్నింటినీ అందుకోగల సామర్థ్యం ఉన్నవాడు. అతనికి సరైన అవకాశాలు దక్కాలి. ఎందుకంటే అతను తప్పకుండా కాబోయే సూపర్ స్టార్' అని గిల్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications