Rohan Gavaskar : బుమ్రా లేకున్నా పెద్దగా పోయేదేం లేదు.. అతను ఈ ఏడాది ఆడిందే ఐదు టీ20 మ్యాచ్‌లు..!

జస్ప్రీత్ బుమ్రా లేకపోవడం వల్ల టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పలేమని, అతను లేకున్నా పెద్ద ప్రాబ్లమ్ ఏమీ ఉండదని మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ అన్నాడు. ఎందుకంటే బుమ్రా ఇటీవల భారత్ ఆడిన చాలా T20లకు దూరమయ్యాడని, అయినా ఇండియా గెలుస్తూనే ఉందని పేర్కొన్నాడు. బుమ్రాకు వెన్ను గాయం కావడంతో రాబోయే T20 ప్రపంచకప్‌లో పాల్గొనడం ప్రస్తుతం డౌటే. ఇక బుమ్రా గురించి వార్తలు వస్తున్న తరుణంలో మాజీలు, విశ్లేషకులు బుమ్రా లేకపోవడం భారత్‌కు బిగ్ లాస్ అంటూ విశ్లేషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గవాస్కర్ స్పందిస్తూ తన అభిప్రాయాలను వెల్లడించాడు.

బుమ్రా సామర్థ్యాన్ని భర్తీ చేయలేం వాస్తవమే కానీ
టీ20ల్లో బుమ్రా సామర్థ్యాన్ని జట్టు భర్తీ చేయలేదనేది వాస్తవమే.. అయితే అతని గైర్హాజరీని మనం నష్టంగా పేర్కొనాల్సిన పని లేదని రోహన్ తెలిపాడు. 'జస్ప్రీత్ బుమ్రాను మరొకరితో భర్తీ చేయలేరు. అతను జట్టులో ఉంటో ఏం చేయగలడో తెలుసు. బుమ్రా లాంటి ప్లేయర్ ఉంటే ఏ జట్టుకైనా ప్రయోజనం ఉంటుంది. నా బౌలింగ్ ఎంపికలో ఫస్ట్ ఛాయిస్ బుమ్రానే. అయితే అతను లేకపోవడం వల్ల లాస్ లేకుండా తదనుగుణమైన ప్రణాళికలు కూడా మన టీమిండియా వద్ద ఉన్నాయి.' అని గవాస్కర్ స్పోర్ట్స్ 18తో అన్నారు.

పెద్దగా వర్క్ లోడ్ ఏం పడిందని
బుమ్రా పనిభారాన్ని గురించి కూడా గవాస్కర్ మాట్లాడాడు. 'బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ గురించి మాట్లాడాల్సొస్తే.. అతను టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత్ తరపున ఆడిన మ్యాచ్‌ల సంఖ్య చాలా తక్కువ. కేవలం ఈ ఏడాది అతను ఐదు మాత్రమే ఆడాడు. కాబట్టి అతనిపై పెద్దగా వర్క్ లోడ్ పడ్డట్లు ఏం కాదు. ఈ సంవత్సరం అతని పనిభారం చాలా ఎక్కువగా అని నేను భావించడం లేదు. అయితే అతని గాయాల బెడదను మాత్రం తగ్గించుకునేందుకు ఒక మార్గాన్ని మాత్రం కనుగొనవలసి ఉంటుంది. అతని నుంచి ఉత్తమ ప్రదర్శనలనే నేను ఎక్స్ పెక్ట్ చేస్తున్నా. అతనో నాణ్యమైన బౌలర్' అని గవాస్కర్ అన్నాడు.

టీం మేనేజ్‌మెంట్ ప్రణాళికలు
'ఈ టీమ్ మేనేజ్‌మెంట్ కూడా బానే కసరత్తులు చేస్తోంది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో మనం చూశాం. రోహిత్ శర్మ.. అవేష్ ఖాన్‌కి 19వ ఓవర్ ఇచ్చాడు. అప్పటికీ భువీకి ఇంకా ఓవర్లున్నాయి. ఆట తర్వాత రోహిత్ అన్న విషయమేంటంటే.. భవిష్యత్తులో యువ ఆటగాళ్లు డెత్ ఓవర్లలో వేయాల్సిన సమయాలు రావొచ్చు. వాళ్లను ముందస్తుగానే పరీక్షించడం ఉత్తమమని. అలా ఇప్పటికే భారత జట్టు బౌలింగ్ పరంగా రకరకాల ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అందువల్ల బుమ్రా లేకున్నా పెద్దగా ఎఫెక్ట్ పడదు. మేనేజ్‌మెంట్ గతంలో చేసిన మిస్టేక్స్ చాలా మట్టుకు రెక్టీఫై చేసుకుంది. అవన్నీ వచ్చే ప్రపంచకప్‌లో సత్ఫలితాలనిస్తాయని అనుకుంటున్నా' అని గవాస్కర్ అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications