మాడ్రిడ్ ఓపెన్: ఫెదరర్ ఖాతాలో అరుదైన ఘనత

స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అరుదైన ఘనత సాధించాడు. 1200వ ఏటీపీ మ్యాచ్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో ఫెదరర్ 1200 విజయాల క్లబ్‌లో చేరాడు. జిమ్మీ కానర్స్ (1274) తర్వాత అత్యధిక ఏటీపీ మ్యాచ్ విజయాల్ని అందుకున్న ఆటగాడు ఫెడరరే.
ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం
మాడ్రిడ్ ఓపెన్‌లో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఫెదరర్ 6-0, 4-6, 7-6 (7-3)తో మోన్‌ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించాడు. దాదాపు మూడేళ్ల తర్వాత క్లే కోర్టులో అడుగుపెట్టిన ఫెదరర్ అద్భుత ఆటతో ఆకట్టుకుని క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లాడు.
స్పెయిన్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్ 4-6, 1-6తో అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) చేతిలో ఓడిపోయాడు. అనంతరం డేవిడ్ ఫెరర్ తన కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఫెరర్ ఓటమితో కెరీర్‌ను ముగించడం విశేషం. ఫెరర్ 27 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్ సాధించాడు. ఇక కెరీర్‌లో అత్యత్తమంగా ప్రపంచ నం.3 ర్యాంకును అందుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications