For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ గెలిచాక ఫెదరర్ ఏం చేశాడో తెలుసా?

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌ పోరులో రఫెల్‌ నాదల్‌పై స్పెయిన్ టెన్నిస్ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ విజయం సాధించి తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ని గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

By Nageshwara Rao

హైదరాబాద్: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్స్‌ పోరులో రఫెల్‌ నాదల్‌పై స్పెయిన్ టెన్నిస్ స్టార్ రోజర్‌ ఫెదరర్‌ విజయం సాధించి తన కెరీర్‌లో 18వ గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్‌ని గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. టైటిల్‌ కోసం ఇద్దరి ఆటగాళ్ల మధ్య రసవత్తరంగా జరిగిన మ్యాచ్‌లో ఫెదరర్‌ 6-4, 3-6, 6-1, 3-6, 6-3 తేడాతో నాదల్‌పై నెగ్గాడు.

ఫైనల్స్‌ పోరులో నాదల్‌ను ఓడించి ట్రోపీ నెగ్గిన తర్వాత ఆ మధుర క్షణాలను తన మిత్రులతో కలిసి బాగా ఆస్వాదించానని ఫెదరర్ ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ గెలిచాక ఆ మరుసటి రోజున కార్టన్ గార్డెన్స్‌లో ఫెదరర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.

Roger Federer parties until the sun comes up after thrilling Australian Open victory

అనంతరం డోపింగ్‌ టెస్టు, ఇతర కార్యక్రమాలు ముగించుకుని తాను ఫ్రెండ్స్‌తో కలిసి నేరుగా బార్‌కు వెళ్లి తెల్లవారే వరకూ డ్యాన్స్‌లతో ఎంజాయ్‌ చేశానని ఫెడరర్‌ తెలిపాడు. 'టైటిల్‌ గెలిచాక స్టేడియం నుంచి బయటకు వచ్చే సరికి రాత్రి 3 గంటలైంది. వెంటనే మిత్రులతో కలిశాను' అని ఫెదదర్ తెలిపాడు.

అనంతరం 'అక్కడి నుంచి నేరుగా బార్‌కు వెళ్లి డీజే సంగీత హోరులో డ్యాన్స్‌లతో సందడి చేశాం. ఇక ఉదయం 6.30కి ట్రోఫీతో రూమ్‌కు చేరుకున్నా. అప్పుడే మా పిల్లలు లేచారు. వాళ్లు నా దగ్గరకు వచ్చి నన్ను ట్రోఫీని తదేకంగా చూస్తుండి పోయారు. ఆ 12 గంటలు నాకు గొప్ప మధుర జ్ఞాపకం' అని ఫెదరర్ తెలిపాడు.

ఆ తర్వాత 'మ్యాచ్‌కి సంబంధించిన కొన్ని హైలెట్స్‌ను చూశాను. మ్యాచ్ జరుగుతున్న సమయంలో నెలకొన్న భావోద్వేగాలను చూశాను. ఇది నన్ను ఎంతో ఆనందానికి గురి చేసింది. ఆ పక్కనే ఉన్న స్నేహితులు, ఫ్యామిలీ నావైపు ఆనందంగా చూశారు' అని ఫెదరర్ పేర్కొన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+