ఫెదరర్.. సచిన్ టెండూల్కర్‌ను కలిసేందుకు ఆసక్తి..!
న్యూఢిల్లీ: స్విట్జర్లాండ్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్, క్రికెట్ దేవుడు సచిన్ టండూల్కర్‌కు వీరాభిమాని. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో పాల్గోనేందుకు ఈ ఏడాది చివర్లో రోజర్ ఫెదరర్ భారత్‌కు వస్తున్నాడు.
ఈ సందర్బంలో సచిన్ టెండూల్కర్ కలవడానికి స్విస్ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ఆసక్తి చూపిస్తున్నాడట. ఈ విషయాన్ని రోజర్ ఫెదరర్ ఏజెంట్ టోనీ గాడ్సిక్ తెలిపాడు. ఇంతకుముందు వింబుల్డన్ సందర్భంగా సచిన్, ఫెదరర్ రెండుసార్లు కలిశారని గాడ్సిక్ చెప్పాడు.

ఏజెంట్ టోనీ గాడ్సిక్ మాట్లాడుతూ భారత పర్యటనలో రోజర్ ఫెదరర్ వీలైనంత ఎక్కువ ప్రదేశాలు తిరగాడనికి ప్రయత్నిస్తున్నాడు. సచిన్‌ను కలవడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నాడు" అని చెప్పారు.
ఫెదరర్ తల్లి దక్షిణాఫ్రికా జాతీయురాలు కావడం, కెరీర్‌లో తొలి కోచ్ ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి కావడంతో సహజంగానే ఫెదరర్‌కు క్రికెట్ పై ఆసక్తి కలిగిందని టోనీ గాడ్సిక్ వివరించాడు. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో క్రికెట్ పట్ల ప్రజాదరణ ఎక్కవగా ఉన్న విషయాన్ని గుర్తు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications