సౌరవ్ గంగూలీ తదనంతరం బీసీసీఐ ప్రెసిడెంట్‌గా 1983 వరల్డ్‌కప్ టీం ప్లేయర్..!

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ప్రస్తుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. అక్టోబర్ 18 తర్వాత ఆ పదవి నుంచి వైదొలగనున్నాడనే వార్తలు హల్ చల్ అవుతున్న సంగతి తెలిసిందే. 2019 అక్టోబర్‌లో బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన గంగూలీ.. త్వరలో ఐసీసీ ఛైర్మన్ పదవికి భారత్ తరఫున పోటీ పడనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అదే గనుక జరిగితే గంగూలీ ఐసీసీ ఛైర్మన్ పదవిని అలంకరించడం ఖాయం. గంగూలీ 2014 నుంచి 2019 మధ్య క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ (CAB) అధ్యక్షుడిగా పనిచేశాడు. 2019నుంచి బీసీసీఐ బాస్‌గా వెలుగొందాడు. ఇకపోతే గంగూలీ ఆ పదవిని వదిలివేయనుండడంతో ఆ పదవిలోకి ఎవరొస్తారనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

అతని ఎంపిక లాంఛనమేనని..
ఇక ఈ విషయంలో అందుతున్న తాజా సమాచారం ప్రకారం.. భారత మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ.. గంగూలీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడవ్వనున్నాడట. అయితే ఈ వార్తలను రోజర్ బిన్నీ ఖండించనూ లేదు. దీంతో అతని ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న బిన్నీ.. ఇటీవలే బీసీసీఐ ఏజీఎంలో కేఎస్‌సీఏ ప్రతినిధిగా ఎంపికయ్యాడు.
అందువల్ల అతను బీసీసీఐ చీఫ్‌కి పోటీ చేసేందుకు అర్హత కూడా సంపాదించాడు. ఇకపోతే భారత్ తరఫున రోజర్ బిన్నీ 27టెస్టులు, 72 వన్డేలు ఆడాడు. 1983ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో రోజర్ బిన్నీ కీలక ప్లేయర్‌గా ఉన్నాడు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ సైతం భారత్ తరఫున ఆడిన సంగతి తెలిసిందే.

మరో పోటీదారుగా ఆయన పేరు
ఇకపోతే బీసీసీసీఐ చీఫ్ పదవికి వినిపిస్తున్న మరో పేరు రాజీవ్ శుక్లా. వీరిద్దరిలో ఎవరైనా ఒకరు బీసీసీఐ చీఫ్ అయితే మరొకరు క్యాష్ రీచ్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఛైర్మన్‌గా ఎంపికవుతారని విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం బీసీసీఐ కార్యదర్శిగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా, కోశాధికారి అరుణ్ ధుమాల్ తమ పదవులను కొనసాగించే అవకాశం ఉంది. ఇటీవలే ఆఫీస్ బేరర్ల పదవీకాలానికి మధ్య తప్పనిసరి కూలింగ్ ఆఫ్ పీరియడ్‌లో సవరణలను సుప్రీంకోర్టు అనుమతించడంతో జైషా పోస్టుకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది.

జై షా పదవికి ఢోకా లేదు
సుప్రీం కోర్టు నిర్ణయంతో జై షా తన పదవిని మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీలయింది. ఇకపోతే అక్టోబర్ 18న ముంబైలో బీసీసీఐ ఎన్నికలు జరగనున్నాయి. క్రికెట్ బాడీ అక్టోబర్ 15న వివిధ పోస్టులకు అభ్యర్థుల జాబితాను విడుదల చేయనుంది. బీసీసీఐ ఉన్నతాధికారులు గంగూలీ, ధుమాల్, జై షా, రాజీవ్ శుక్లా, ఎన్ శ్రీనవాసన్ బుధవారం సమావేశమై ఎన్నికల విషయాలను చర్చించినట్లు తెలుస్తోంది. ఎవరు ఏ పదవుల్లో దిగాలి, కొనసాగాలనే విషయమై సుదీర్ఘ మంతనాలు జరిపినట్లు సమాచారం. జై షా బీసీసీఐ అధ్యక్షుడిగా అవుతాడనే వార్తలు అప్పట్లో రాగా.. క్రికెట్ నేపథ్యం లేని కారణంగా.. అతన్ని చీఫ్ పదవికి నామినేట్ చేస్తే ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందువల్లే కార్యదర్శి పదవిలో కొనసాగించడమే ఉత్తమమని గుసగుసలు వినిపిస్తున్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications