Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నువ్వే నాకు స్ఫూర్తి: చాహల్ టీవీకి ఇచ్చిన ఇంటర్యూలో మంధాన జోక్

 ROFL! You Are my Batting Inspiration: Smriti Jokes With Yuzi on Chahal TV

హైదరాబాద్: యజువేంద్ర చాహుల్... ఇటీవల కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణిస్తోన్న చైనామన్ స్పిన్నర్. అంతేకాదు మ్యాచ్ అనంతరం జట్టులోని సహచర క్రికెటర్లతో చాహల్‌ టీవీ పేరుతో ఇంటర్యూలు కూడా తీసుకంటున్నాడు. తాజాగా భారత మహిళా జట్టు ఓపెనర్ స్మృతి మంధానను చాహల్ ఇంటర్యూ చేశాడు.

ప్రస్తుతం భారత మహిళల జట్టు న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న నేపథ్యంలో మంధానతో ముచ్చటించాడు. బుధవారం జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ చేతిలో భారత మహిళల జట్టు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం మంధాన బ్యాటింగ్‌పై చాహల్ విశ్లేషించాడు.

చాహల్‌తో నువ్వేతో స్ఫూర్తి అన్న మంధాన

చాహల్‌తో నువ్వేతో స్ఫూర్తి అన్న మంధాన

ఈ క్రమంలో ‘నా బ్యాటింగ్‌కు నువ్వే స్ఫూర్తి' అంటూ చాహల్‌తో మంధాన జోక్‌ చేసింది. తన బ్యాటింగ్‌ను చూసిన ఏమైనా నేర్చుకున్నారంటూ చాహల్‌ అడగ్గా మంధాన తడుముకోకుండా సమాధానం చెప్పడం విశేషం. "అవును.. నా బ్యాటింగ్‌ తీరుకు నువ్వే స్ఫూర్తి. హామిల్టన్‌లో న్యూజిలాండ్‌ జట్టుపై నువ్వు బ్యాటింగ్ చేసిన తీరు నన్ను ఎంతగానో ఆకట్టుకుంది" అని మంధాన చెప్పుకొచ్చింది.

నేను స్ఫూర్తి పొందే క్రికెటర్లలో నువ్వు ఒకడివి

"నేను అప్పుడే అనుకున్నా.. నా గేమ్‌ను ఇంకా మెరుగుపరుచుకోవాలనుకున్నా. నేను స్ఫూర్తి పొందే క్రికెటర్లలో నువ్వు ఒకడివి. నేను బ్యాటింగ్‌కు వెళ్లే క్రమంలో నీ ఆట తీరును గుర్తు చేసుకుంటున్నా' అని మంధానం చెప్పడంతో అక్కడ నవ్వులు పూశాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు పంపమని అడిగిన చాహల్

కోహ్లీ స్థానంలో బ్యాటింగ్‌కు పంపమని అడిగిన చాహల్

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే అనంతరం తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మను ఇంటర్య్యూ చేసే క్రమంలో తన బ్యాటింగ్‌ ఆర్డర్‌ను మార్చమంటూ చాహల్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో అతడి స్థానంలో తనను బ్యాటింగ్‌కు పంపమని రోహిత్‌ను అడిగాడు. నాలుగో వన్డేలో భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా చాహల్ నిలిచాడు.

Story first published: Thursday, February 7, 2019, 13:15 [IST]
Other articles published on Feb 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+