Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens T20 Challenge: దంచికొట్టిన రోడ్రిగ్స్, మేఘన.. వెలాసిటీ ముందు భారీ టార్గెట్ ఉంచిన ట్రైల్‌బ్లేజర్స్

Rodrigues, Meghana pure hitting helps to Trail Blazers to scorea a massive 190runs

ఐపీఎల్ 2022 మహిళల టీ20 ఛాలెంజ్‌లో మూడోది, మరియు చివరిదైన గ్రూప్ స్టేజ్ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో వెలాసిటీ వర్సెస్ ట్రైల్‌బ్లేజర్స్ మధ్య జరుగుతుంది. ఇక ఫైనల్ చేరాలంటే ట్రైల్‌బ్లేజర్స్ టోర్నీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకునేలా నేటి మ్యాచ్‌లో వెలాసిటీపై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెలాసిటీ కెప్టెన్ దీప్తి శర్మ టాస్ గెలిచి ముందు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ దిగిన ట్రైల్ బ్లేజర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20వ ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 190పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఇక ట్రైల్‌బ్లేజర్స్ బ్యాటర్లలో కెప్టెన్ స్మృతి మంధాన (1పరుగు)కే ఔటవ్వడంతో అంతా నిరాశచెందారు. కానీ మంధాన అవుట్ అయినా ఆ ఎఫెక్ట్ ఏం పడకుండా సబ్బినేని మేఘన (73పరుగులు 47బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగి ఆడింది. అలాగే జెమిమియా రోడ్రిగ్స్ (66పరుగులు 44బంతుల్లో 7ఫోర్లు 1సిక్సర్) వీరవిహారం చేసింది. ఇక తొలి వికెట్ భాగస్వామ్యానికి 113పరుగులు జోడించారు. వీరిద్దరు వెలాసిటీ బౌలర్లపై ఎడాపెడా సిక్సర్లు బాదుతూ బెంబేలెత్తించారు. ఇక వీరిద్దరి జోడీకి స్నేహ రాణా బ్రేకులు వేసింది. మేఘనను ఔట్ చేసింది. రోడ్రిగ్స్ కూడా కాసేపటికే ఔటయింది. అయిన చివర్లో హైలీ మాథ్యుస్ (27పరుగులు 16బంతుల్లో 4ఫోర్లు), డంక్లీ (19పరుగులు 8బంతుల్లో 2ఫోర్లు 1సిక్సర్) చెలరేగడంతో ట్రైల్ బ్లేజర్స్ 190పరుగుల భారీ స్కోరు సాధించింది.

తుది జట్లు
ట్రైల్‌బ్లేజర్స్ (ప్లేయింగ్ XI): స్మృతి మంధాన (సి), హేలీ మాథ్యూస్, జెమిమా రోడ్రిగ్స్, సోఫియా డంక్లీ, సబ్బినేని మేఘన, రిచా ఘోష్ (w), అరుంధతి రెడ్డి, సల్మా ఖాతున్, పూనమ్ యాదవ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్

వెలాసిటీ (ప్లేయింగ్ XI): షఫాలీ వర్మ, నత్తకాన్ చంతమ్, యాస్తిక భాటియా(w), లారా వోల్వార్డ్ట్, దీప్తి శర్మ(సి), కిరణ్ నవ్‌గిరే, స్నేహ రాణా, రాధా యాదవ్, కేట్ క్రాస్, అయాబొంగా ఖాకా, సిమ్రాన్ బహదూర్

Story first published: Thursday, May 26, 2022, 21:35 [IST]
Other articles published on May 26, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+