
నేను ఒక్క గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు
ఐపీఎల్ ప్రారంభ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఉతప్ప అరంగేట్రం చేశాడు. అయితే అతన్ని 2009లో జరిగిన రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుక్కుంది. 'నేను నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలను ఎదుర్కొన్నాను. ఆర్సీబీతో ఆడినప్పుడు నేను పూర్తిగా డిప్రెషన్‌లో ఉన్నాను. ఆ సీజన్‌లో నేను ఒక్క గేమ్ కూడా సరిగ్గా ఆడలేదు. నన్ను ఇక డ్రాప్ చేయాలనుకున్న టైంలో ఒక్క మ్యాచ్ బాగా ఆడాను. తద్వారా మళ్లీ జట్టులో ఉన్నాను. అంతకుముందు కూడా కొన్ని ఇబ్బందులు నన్ను చుట్టుముట్టాయి. ముంబై జట్టు నుంచి ట్రాన్స్ ఫర్ పత్రాలపై సంతకం చేయకపోతే..నేను ముంబై ప్లేయింగ్ XIలో ఆడలేనని ఎంఐకి చెందిన ఒకరు నాతో చెప్పారు.'అని ఉతప్ప చూచాయగా చెప్పాడు.

ఆ సీజన్లో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా
ఇక ఉతప్ప 2009లో జింబాబ్వేతో తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇక అనంతరం ఉతప్ప ఐపీఎల్‌లో మంచి ప్లేయర్‌గా కొనసాగాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరడానికి ముందు ఆర్సీబీ తరఫున చాలా మంచి నాక్‌లు ఆడాడు. 2014 ఐపీఎల్ టైంలో కోల్‌కతా జట్టు ట్రోఫీ సాధించిన జట్టులో ఉతప్ప ఉన్నారు. విజేత జట్టులో భాగమయ్యాడు. ఆ సీజన్లో ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోటీలో కోల్‌కతా విజయం సాధించింది. ఆ సంవత్సరంలో పోటీలో అత్యధిక పరుగులు చేసినందుకు ఉతప్ప ఆరెంజ్ క్యాప్ కూడా పొందాడు. తరువాత.. అతను కొన్నాళ్ల పాటు ఫామ్ కోల్పోయాడు. ఇక అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసుకుంది. చెన్నై తరఫున కూడా పర్వాలేదనిపించే ప్రదర్శనలు చేశాడు. 2021లో చెన్నై ట్రోఫీ గెలిచిన సీజన్లో ఉతప్ప కొన్ని మంచి నాక్స్ ఆడాడు.

దూకుడుకు మారుపేరుగా ఉతప్ప
మూడు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఊతప్ప.. 2006లో ఇంగ్లాడ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 46 వన్డేల్లో 6 హాఫ్ సెంచరీలతో 934 పరుగులు చేశాడు. 13 టీ20ల్లో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 249 రన్స్ నమోదు చేశాడు. 205 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 27 హాఫ్ సెంచరీలతో సాయంతో 130.3 స్ట్రైక్‌రేట్‌తో 4952 రన్స్ చేశాడు. దూకుడుకు మారుపేరుగా నిలిచిన ఊతప్ప.. అనేక మ్యాచ్‌ల్లో తాను ప్రాతినిథ్యం వహించిన జట్లను గెలిపించాడు.


Click it and Unblock the Notifications












