
దీటుగా బదులిచ్ఛా
సౌరవ్ గంగూలీ, రిషబ్ పంత్ యూట్యూబ్ షో 'వేకప్ విత్ సౌరవ్'లో రాబిన్ ఊతప్ప పలు విషయాలపై చర్చించాడు. ఈ క్రమంలో తన రోల్‌మోడల్‌తో జరిగిన గొడవ గురించి ఊతప్ప తెలిపాడు. '2007 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో మ్యాచ్ ఆడాం. నేను గౌతమ్ గంభీర్.. ఆండ్రూ సైమండ్స్, మిచెల్ జాన్సన్, బ్రాడ్ హాడిన్ స్లెడ్జింగ్‌ను తిప్పికొట్టాం. అయితే ఒక వ్యక్తిగా, బ్యాట్స్‌మెన్‌గా నాకెంతో స్ఫూర్తిగా నిలిచిన మాథ్యూ హెడెన్‌తో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. తను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నన్ను ఉద్దేశించి ఏదో అన్నాడు. నేను కూడా తనకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నా. అంతే ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది' అని ఊతప్ప చెప్పాడు.

2-3 ఏళ్ల పాటు మాట్లాడలేదు
'ఆ వివాదం అక్కడితో ముగిసిపోలేదు. ఆ ఘటన జరిగిన తర్వాత 2-3 ఏళ్ల పాటు అతడు నాతో మాట్లాడలేదు. నాకు దూరంగా ఉండేవాడు. అది నన్ను చాలా బాధించింది. ఆ మ్యాచ్‌లో మేం గెలిచాం. కానీ నా రోల్‌మోడల్‌తో మాట్లాడే అవకాశం కోల్పోయా. ఆ సంవత్సరం తరువాత ఆస్ట్రేలియా ఏడు వన్డే సిరీస్ మరియు ఒక టీ20 మ్యాచ్ ఆడటానికి భారత్ వచ్చింది. అప్పుడు కూడా మేము ఇద్దరం మాట్లాడుకోలేదు. ఎంఎస్ ధోనీ, ఇతర సీనియర్ ఆటగాళ్లు ఆ సిరీస్‌లో నన్ను ఆటపట్టించారు. అదో గొప్ప సమయం' అని రాబిన్ ఊతప్ప తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. ఇప్పటివరకు 46 వన్డేల్లో 934, 13 టీ20ల్లో 249 పరుగులు చేశాడు.
IPL 2021: హమ్మయ్య.. ఎట్టకేలకు స్వదేశం చేరుకున్న ఆసీస్ క్రికెటర్లు! హస్సీ మాత్రం!

అక్తర్ బెరించాడు
క్రీజు బయటకొచ్చి ఆడితే భయంకర బౌన్సర్లతో దాడి చేస్తానని పాకిస్తాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తనను బెదిరించాడని రాబిన్ ఉతప్ప అన్నాడు. '2007లో పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడాం. నాలుగో వన్డే ముందురోజు మేమంతా కలిసే డిన్నర్ చేశాం. అక్తర్ భాయ్ నా వద్దకొచ్చాడు. గువాహటి వన్డేలో బాగా ఆడానని ప్రశంసించాడు. నేను క్రీజు దాటి అతడి బౌలింగ్‌ను ఆడానని చెప్పాడు. అయితే మరోసారి అలా ఆడితే బాగుండదన్నాడు. బహుశా నీ తలకు గురిపెడుతూ ఓ భయానక బౌన్సర్ రావొచ్చని బెదిరించాడు. ఆ తర్వాత నేనలా ఆడేందుకు భయపడ్డాను' అని ఉతప్ప చెప్పుకొచ్చాడు.


Click it and Unblock the Notifications












