Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Robin Uthappa : తప్పకుండా ఆ ఇద్దరు పేసర్లను తీసుకోవాల్సిందే.. ఉతప్ప ప్రకారం టీ20 వరల్డ్‌కప్ భారత టీం ఇలా..!

Robin Uthappa Says Arshdeep singh and deepak chahar Should select for T20World cup squad

ఆస్ట్రేలియాలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌కు భారత్ అయిదుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకుంటుందని భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్‌లతో పాటు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్‌లు జట్టుకు ఎంపిక కావాలని అతను సూచించాడు. డెత్ ఓవర్లలో అర్షదీప్ సింగ్ తన కట్టుదిట్టమైన స్పెల్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అర్షదీప్, దీపక్ చాహర్ టీ20 ఫార్మాట్‌లో ప్రస్తుతం మంచి ఫామ్‌ కనబర్చగలరని, వారు జట్టుకు స్ట్రెంత్ అవుతారని రాబిన్ తెలిపాడు. ESPNCricinfoలో మాట్లాడుతూ.. ఉతప్ప తన అభిప్రాయాలను వెల్లడించాడు.

భువీని ఉపయోగించుకోవడం కీలకం

భువీని ఉపయోగించుకోవడం కీలకం

'ఇక వీరిలో టాప్ ఛాయిస్ ప్లేయర్లు భువీ, బుమ్రా, హర్షల్. తొలుత భువనేశ్వర్ కుమార్ పవర్ ప్లేలో ఆరు ఓవర్లలో మూడు ఓవర్లు బౌలింగ్ చేస్తాడు. ఆపై మిడిల్ ఓవర్లలో లేదా డెత్ ఓవర్లలో ఒక ఓవర్ బౌలింగ్ చేస్తాడు. డెత్‌ ఓవర్లలో ప్రధానంగా హర్షల్, బుమ్రా బౌలింగ్ చేస్తారని నేను భావిస్తున్నాను. వీలయితే భువీ కూడా డెత్ ఓవర్లలో ఒక్క ఓవర్ వేయడానికి వీలవుతుంది. లేకపోతే మిడిల్ ఓవర్లలో వికెట్ కావాలనుకున్నప్పుడు అతనికి బౌలింగ్ ఇస్తే కాస్త బెటర్ రిజల్ట్ ఉంటుంది. కాబట్టి భువీని జట్టు ఎలా ఉపయోగించుకోబోతుందనేది చాలా కీలకం కానుంది.'

అవేశ్ ఖాన్ ఇక కష్టమే

అవేశ్ ఖాన్ ఇక కష్టమే

'ఏదేమైనా ఆస్ట్రేలియా పిచ్‌లలో పేస్ ప్రభావం ఎక్కువ కాబట్టి ఇండియా తప్పకుండా స్క్వాడ్‌లో ఐదుగురు ఫాస్ట్ బౌలర్లను తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ ముగ్గురితో పాటు అర్షదీప్ సింగ్, దీపక్ చాహర్ కూడా జట్టుకు తప్పక ఎంపిక కావాలి. వీరు బుమ్రా, భువీ, హర్షల్‌‌లు తుది జట్టులో ఉంటే బెంచ్ ప్లేయర్లుగా ఉంటారు. వారిలో ఎవరు అందుబాటులో లేకున్నా ఆస్థానాన్ని వీరు భర్తీ చేయగలరు. హార్దిక్ ఆరో ఫాస్ట్ బౌలర్‌గా ఎలాగూ ఆడతాడు' అని ఉతప్ప చెప్పాడు. ఉతప్ప అవేష్ ఖాన్‌ గురించి కూడా వ్యాఖ్యానించాడు. ఆసియా కప్‌ టోర్నీలో పేలవమైన ప్రదర్శన తర్వాత అవేశ్ ఖాన్ జట్టు ఎంపిక విషయంలో చాలా దిగువకు పడిపోయాడని చెప్పాడు. ముఖ్యంగా బుమ్రా హర్షల్ పటేల్ మళ్లీ జట్టులో చేరితే అతనికి అవకాశాలు ఉండబోవని తెలిపాడు.

 స్పెషలిస్టు స్పిన్నరా..? లేక స్పిన్ ఆల్రౌండరా?

స్పెషలిస్టు స్పిన్నరా..? లేక స్పిన్ ఆల్రౌండరా?

రాబిన్ ఊతప్ప చెప్పిన ప్రకారం గనుక టీ20 వరల్డ్ కప్ జట్టును ఎంపిక చేసినట్లయితే జట్టు ఎలా ఉండబోతుందో ఓసారి పరిశీలిద్దాం. రవీంద్రా జడేజా గాయంతో దూరమయ్యాడు. కాబట్టి స్పిన్ ఆప్షన్లలో రవిచంద్రన్ అశ్విన్ లేదా అక్షర్ పటేల్ ఎంపికకావొచ్చు. స్పెషలిస్టు స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ ఫిక్స్. ఇక బ్యాటింగ్ దళాన్ని ఎలాగూ కెప్టెన్ రోహిత్ శర్మ నడిపిస్తాడు. అయితే మరో స్పెషలిస్టు స్పిన్నర్‌ను తీసుకుంటారా లేక స్పిన్ ఆల్రౌండర్‌ను తీసుకుంటారా అనేది కాస్త డౌట్, ఎందుకంటే బ్యాటింగ్ పరంగా కచ్చితంగా మినిమం ఏడుగురిని అయితే జట్టు ఎంపిక చేస్తుంది. 15మంది కంటే ఎక్కువమందిని వరల్డ్ కప్ టోర్నీకి ఎంపిక చేయొద్దనే నిబంధన ఉన్న సంగతి తెలిసిందే.

15మందితో ఇండియా టీం ఇలా ఉండొచ్చు

15మందితో ఇండియా టీం ఇలా ఉండొచ్చు

బ్యాటర్లు : 1. రోహిత్ శర్మ (కెప్టెన్), 2.కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), 3.కోహ్లీ, 4.సూర్యకుమార్ యాదవ్, 5.రిషబ్ పంత్ / ఇషాన్ కిషన్, 6. దినేష్ కార్తీక్, 7. సంజూ శాంసన్

స్పిన్నర్లు : 8. రవిచంద్రన్ అశ్విన్ / అక్షర్ పటేల్, 9.యుజ్వేంద్ర చాహల్

ఆల్రౌండర్ : 10.హార్దిక్ పాండ్యా

పేసర్లు : 11.జస్ప్రీత్ బుమ్రా, 12.భువనేశ్వర్ కుమార్, 13.దీపక్ చాహర్, 14.అర్షదీప్ సింగ్, 15.హర్షల్ పటేల్

Story first published: Sunday, September 11, 2022, 15:48 [IST]
Other articles published on Sep 11, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+