'ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!'
గత కొద్ది కాలంగా టీమిండియా కెప్టెన్సీపై చర్చలు ఊపందుకున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటాడని, కొత్త కెప్టెన్ వేట మొదలైందంటూ వార్తలు జోరుగా ప్రచారం సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ గా శుభ్ మన్ గిల్, జస్ప్రిత్ బుమ్రా పేర్లు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. భారత జట్టు కొత్త కెప్టెన్ అతడేనంటూ మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భవితవ్యం గురించి కూడా మాట్లాడాడు. ఏం అన్నాడంటే?
అతడే కొత్త కెప్టెన్..
మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప తరచుగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడన్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ గురించి మాట్లాడుతూ తన అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తుంటాడు. అయితే తాజాగా.. గత కొంత కాలంగా చర్చ జరుగుతోన్న టీమిండియా కొత్త కెప్టెన్సీ గురించి మాట్లాడాడు. భారత జట్టు కొత్త కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ అవుతాడని అన్నాడు. "నాకు తెలిసి శ్రేయస్ అయ్యరే టీమిండియా నెక్ట్స్ కెప్టెన్" అని అన్నాడు.

కోహ్లీ, రోహిత్ కు ఇదే లాస్ట్..
నాకు తెలిసి ఇదే కోహ్లీ, రోహిత్ కు లాస్ట్ టోర్నమెంట్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇదే చివరిది కాకుండా పోవచ్చు. కానీ కోహ్లీ, రోహిత్ కలిసి ఆడేది మాత్రం ఇదే చివరిది అవుతుందని అనుకుంటున్నాను. కాబట్టి జట్టులోని ప్రతిఒక్కరూ దీన్ని పరిగణలోకి తీసుకుని ఆడాలని భావిస్తున్నాను. ఇక విరాట్ కోహ్లీ ఈ ఏడాది భారీగా పరుగులు చేస్తాడని ఆశిస్తున్నాను. ఇక్కడ నుంచే (ఛాంపియన్స్ ట్రోఫీ) ఆ పనిని ప్రారంభిస్తాడని నేను అనుకుంటున్నాను. విరాట్ చాలా త్వరగా ఫామ్ ను అందుకుంటాడు." అని చెప్పుకొచ్చాడు.
Robin Uthappa said "I think Shreyas Iyer is going to be the next Indian Captain". [Star Sports] pic.twitter.com/wKepoJLPXb
— Johns. (@CricCrazyJohns) February 20, 2025
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications