రాబిన్ ఉతప్ప వన్డే జట్టు: కెప్టెన్‌గా ధోనీ.. ఐదుగురు భారత ఆటగాళ్లకు చోటు!!

బెంగళూరు: ఈ దశాబ్దం ముగియడంతో మాజీ క్రికెటర్లు, పలు సంస్థలు తమతమ టెస్ట్, వన్డే, టీ20 డ్రీమ్ జట్లను ప్రకటిసున్నారు. సౌరవ్ గంగూలీ, రికీ పాంటింగ్, ఇషాంత్ శర్మ, ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్‌ఫో, క్రిక్‌బజ్, విజ్డెన్ ఇప్పటికే ఈ దశాబ్దపు జట్లను ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో టీమిండియా వెటరన్ ఓపెనర్ రాబిన్ ఉతప్ప కూడా చేరిపోయాడు. ఉతప్ప ఈ దశాబ్దపు వన్డే జట్టును ప్రకటించాడు.

కెప్టెన్‌గా ధోనీ:
2010-2019 దశాబ్ద కాలంలో వన్డేల్లో నిలకడగా రాణించిన ఆటగాళ్లతో రాబిన్ ఉతప్ప ఓ జట్టుని ఎంపిక చేశాడు. ఉతప్ప తన దశాబ్దపు వన్డే జట్టుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని సారధిగా ఎంచుకున్నాడు. 2007లో టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న ఉతప్ప.. ధోనీ కెప్టెన్సీలో చాలా మ్యాచ్‌లు ఆడిన విషయం తెలిసిందే. ఉతప్పను మహీ ఓపెనర్‌గా పంపిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఐదుగురు భారత క్రికెటర్లకి చోటు:
ఇక రాబిన్ ఉతప్ప ఎంపిక చేసిన జట్టులో ఐదుగురు భారత క్రికెటర్లకి చోటు లభించింది. ఓపెనర్‌లుగా రోహిత్ శర్మ, క్రిస్‌గేల్‌ని ఎంపిక చేసుకున్నాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీకి అవకాశం ఇచ్చాడు. మిడిలార్డర్‌లో స్టీవ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్‌కి చోటిచ్చాడు. మ్యాచ్ ఫినిషర్‌గా ధోనీ.. ఆల్‌రౌండర్ కోటాలో బెన్‌స్టోక్స్‌ను తీసుకున్నాడు. బౌలింగ్ విభాగంలో డేనియల్ వెటోరీ, జహీర్ ఖాన్, లసిత్ మలింగలను తీసుకున్నాడు.

46 వన్డేలు, 13 టీ20లు:
భారత్ తరఫున రాబిన్ ఉతప్ప 46 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. 2015లో చివరగా టీమిండియా మ్యాచ్‌లు ఆడిన ఉతప్ప.. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగుతున్నాడు. గత డిసెంబరు 19న జరిగిన ఐపీఎల్ వేలానికి ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ .. ఉతప్పని వేలంలోకి వదిలేసింది. రూ. 1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన ఉతప్ప.. రూ. 3 కోట్లకు అమ్ముడుపోయాడు.

రాబిన్ ఉతప్ప దశాబ్దపు వన్డే జట్టు:
రోహిత్ శర్మ, క్రిస్‌గేల్, విరాట్ కోహ్లీ, స్టీవ్‌స్మిత్, ఏబీ డివిలియర్స్, యువరాజ్ సింగ్, మహేంద్రసింగ్ ధోనీ (కెప్టెన్), బెన్ స్టోక్స్, డేనియల్ వెటోరీ, జహీర్ ఖాన్, లసిత్ మలింగ.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications