
ట్యాక్టిక్స్ తెలిసిన ప్లేయర్
ఇక ఆ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ.. వ్యక్తిగతంగా బుమ్రా ప్రదర్శన, కెప్టెన్సీ పర్వాలేదనిపించింది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్లోనూ బుమ్రా సెన్సేషనల్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను 2-2తో ఇంగ్లాండ్ సమం చేసింది. ఏదేమైనప్పటికీ బుమ్రా టీమిండియా తరఫున అత్యుత్తమ ట్యాక్టిక్స్ తెలిసిన ప్లేయర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అతని వ్యూహాలు తప్పకుండా ఇండియాకు హెల్ప్ అవుతాయి. ఇక టెస్ట్ ఫార్మాట్‌లో ఈ స్పీడ్‌స్టర్ భారత జట్టుకు కెప్టెన్సీని చేపట్టాలని ఉతప్ప అనుకోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు.

వన్డేలకు వారిద్దరిలో ఎవరైనా ఓకే
రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. జస్ప్రీత్ బుమ్రా టెస్ట్ క్రికెట్‌కు గొప్ప కెప్టెన్ కాగలడు. వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ లేదా రిషబ్ పంత్ బెటర్ అని ఉతప్ప షేర్‌చాట్ ఆడియో చాట్‌రూమ్ సెషన్‌లో పేర్కొన్నాడు. గతేడాది దక్షిణాఫ్రికాలో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డేలకు రాహుల్ నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ వన్డే సిరీస్లో భారత్ 0-3తో ఓటమి పాలయింది. దీంతో వన్డేలకు కెప్టెన్సీ విషయంలో అతనికి అది సరైన ఆరంభం కాకపోవచ్చు. కానీ అతను ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ప్లేఆఫ్ వరకు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇకపోతే రిషబ్ పంత్ వయసులో రాహుల్ కంటే ఆరేళ్లు చిన్నవాడు. పైగా అతనికి సుదీర్ఘకాలం భారత జట్టుకు కెప్టెన్సీ వహించే అవకాశముంటుంది. భవిష్యత్తులో భారత జట్టులో పంత్ మరియు రాహుల్ ఇద్దరూ పెద్ద పాత్ర పోషించే అవకాశముంది.

జట్టులో కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించడమేంటో..?
ఇకపోతే విరాట్ కోహ్లీని విమర్శించేవారి మీద కూడా రాబిన్ ఉతప్ప సీరియస్ వ్యాఖ్యలు చేశాడు. జట్టులో కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించడం సరికాదన్నాడు. కోహ్లి సెంచరీల మీద సెంచరీలు బాదినప్పుడు ఎలా ఆడాలో అతనికి ఎవరూ చెప్పలేదని, ఇప్పుడెందుకు అందరు నోరెళ్లబెడుతున్నారని కాస్త అసహనం వ్యక్తం చేశాడు. కోహ్లీ ఒక్కసారి తన సమస్యేంటో గుర్తించి.. రెక్టిఫై చేసుకుంటే.. తన మునుపటి ఫామ్‌ను అందుకుంటాడని ఉతప్ప చెప్పాడు. కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్లో మరో 30-35సెంచరీలు సాధించగలిగే సత్తా ఉందని, ఎలా ఆడాలో.. ఏం చేయాలో కోహ్లీకి ఎవరూ చెప్పాల్సిన పనిలేదని, జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని కూడా ఉతప్ప స్పష్టం చేశాడు.


Click it and Unblock the Notifications












