Robin Uthappa: ఇప్పుడందరికీ నోళ్లు లేస్తున్నాయి..! కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించే హక్కు ఎవ్వడికీ లేదు

సీఎస్కే స్టార్ బ్యాటర్ రాబిన్ ఉతప్ప విరాట్ కోహ్లీ విమర్శకులపై విరుచుకుపడ్డాడు. జట్టులో కోహ్లీ స్థానాన్ని ప్రశ్నించడం అన్యాయమన్నాడు. విరాట్ కోహ్లి సెంచరీల మీద సెంచరీలు బాదినప్పుడు ఎలా ఆడాలో అతనికి ఎవరూ చెప్పలేదని, ఇప్పుడెందుకు అందరికీ నోళ్లు లేస్తున్నాయని మండిపడ్డాడు. అతను తన సమస్యేంటో గుర్తించి.. ఒక్కసారి రెక్టిఫై చేసుకుంటే.. తన పీక్ ఫామ్‌ను అందుకుంటాడని ఉతప్ప చెప్పాడు.
విరాట్ కోహ్లీకి అంతర్జాతీయ కెరీర్లో మరో 30-35సెంచరీలు సాధించగలిగే సత్తా ఉందని, ఎలా ఆడాలో.. ఏం చేయాలో కోహ్లీకి ఎవరూ చెప్పాల్సిన పనిలేదని, జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని షేర్‌చాట్ ఆడియో చాట్‌రూమ్ సెషన్‌లో ఉతప్ప స్పష్టం చేశాడు.

ఇటీవల పేలవ ఫామ్ కనబర్చుతున్న కోహ్లీ..
ఇకపోతే ఇటీవల విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్లలో పేలవ ఫామ్ కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌లో ఇటీవల ముగిసిన పరిమిత ఓవర్ల సిరీస్‌లో కోహ్లీ 4మ్యాచ్‌ల్లో కేవలం 45పరుగులే చేయగలిగాడు. బర్మింగ్‌హామ్‌లో రీషెడ్యూల్ చేయబడిన 5వ టెస్టులోనూ రెండు ఇన్నింగ్స్‌లలో కేవలం 11, 20పరుగులే చేసి విఫలమయ్యాడు. ఇక ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం కోహ్లీకి సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. తిరిగి ఆసియాకప్ సమయానికి అతను జట్టులోకి రావొచ్చు.

కాస్త స్పేస్ ఇవ్వండి
ఇక ఉతప్ప మాట్లాడుతూ.. 'మనం కోహ్లీకి కాస్త స్పేస్ ఇవ్వాలి. అతని క్రికెట్ అతన్ని ఆడనివ్వాలి. అతనికి ఏది బాగా వర్కవుట్ అవుతుందో అతనికి తెలుసు. మనం చేయాల్సిందల్లా అతనికి కాస్త టైం.. వీలయినంత స్వేచ్ఛ ఇవ్వడమే.' అని ఊతప్ప పేర్కొన్నాడు. ఇక ఉతప్ప మాట్లాడుతూ.. 'మనం కోహ్లీకి కాస్త స్పేస్ ఇవ్వాలి. అతని క్రికెట్ అతన్ని ఆడనివ్వాలి. అతనికి ఏది బాగా వర్కవుట్ అవుతుందో అతనికి తెలుసు. మనం చేయాల్సిందల్లా అతనికి కాస్త టైం.. వీలయినంత స్వేచ్ఛ ఇవ్వడమే.' అని ఊతప్ప పేర్కొన్నాడు. కోహ్లీకి విశ్రాంతి అవసరమా లేదా అనేది అతనే నిర్ణయించుకోవాలని.. అతని స్థానం గురించి పెద్దగా చర్చోపచర్చలు పెట్టొద్దని విమర్శకులను కోరారు.

సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా రాణిస్తుండడంతో
సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా లాంటి ప్లేయర్లు ప్రస్తుతం రాణిస్తుండడం వల్ల ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి టీ20జట్టులో చోటు దక్కడంపై అనేక ప్రశ్నలు వస్తున్న సంగతి తెలిసిందే. జూన్‌లో ఐర్లాండ్‌పై హుడా సెంచరీ బాదగా.. ఈ నెల ప్రారంభంలో ఇంగ్లాండ్ మీద సూర్యకుమార్ సెంచరీతో అలరించాడు. టీ20 ఫార్మాట్లో బ్యాట్‌తో మరింత దూకుడుగా ఆడాలని భారత్ చూస్తున్నందున.. విరాట్ కోహ్లీ పేలవ ఫామ్ జట్టులో అతని స్థానం పట్ల ఆందోళన రేకెత్తిస్తుంది. ఇక విరాట్ కోహ్లీని తప్పించాలని పలువురు ప్రముఖులు కామెంట్లు కూడా చేశారు.

ఎవరికీ హక్కు లేదు
ఇక విరాట్ కోహ్లీ విషయంలో జరుగుతున్న చర్చ మీద ఊతప్ప స్పందిస్తూ.. 'కోహ్లీకి విశ్రాంతి తీసుకోవాలనుకుంటే అతన్ని స్వచ్చందంగా తీసుకోనివ్వండి. అతను సిరీస్ లేదా ఏదైనా టోర్నీ ఆడాలనుకుంటే ఆడటానికి వీలు కల్పించండి. అంతే గానీ జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నార్థకం చేయవద్దు. అతను ఓ మ్యాచ్ విన్నర్. ఆ విషయాన్ని నిరూపించాల్సిన అవసరమే లేదు. ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెటర్. మ్యాచ్‌లు గెలిపించే అతని సామర్థ్యాన్ని ప్రశ్నించడానికి, జట్టులో అతని స్థానాన్ని ప్రశ్నించడానికి ఎవరికీ హక్కు లేదు' అని ఉతప్ప పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications