నాలో కసి ఇంకా అలానే ఉంది.. ఇంకో ప్రపంచకప్ ఆడుతా: ఉతప్ప

కర్ణాటక: నాలో ఆడాలనే కసి ఇంకా అలానే ఉంది, తప్పకుండా సత్తా చాటగలను అని కర్ణాటక బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప అంటున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున ప్రపంచకప్‌కు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది అని 34 ఏళ్ల ఉతప్ప పేర్కొన్నాడు. రాబిన్ ఉతప్ప అంతర్జాతీయ క్రికెట్ ఆడి అయిదేళ్లవుతోంది. 2015 తర్వాత అతను భారత జట్టుకు ఆడలేదు. ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. ఇతగాడు మళ్లీ జట్టులోకి వస్తాడన్న ఆలోచన ఎవ్వరికీ లేదు. కానీ ఉతప్ప మాత్రం ఇంకో ప్రపంచకప్ ఆడే సత్తా తనలో ఉందంటున్నాడు.

ఇంకో ప్రపంచకప్ ఆడుతా:
తాజాగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ... 'నాలో భారత్ తరఫున ఆడాలనే కసి ఇంకా అలానే ఉంది. తప్పకుండా సత్తా చాటగలను. టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున ప్రపంచకప్‌కు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. దానికి అదృష్టం, దేవుడి ఆశీర్వాదం కూడా కావాలి. భారత్‌లో ఇది ఎంతో ముఖ్యం, ఇతర దేశాల్లో అయితే పెద్దగా అవసరం లేదు. అంతేకాక మనపై మనం విశ్వాసం ఉంచుకోవాలి. సానుకూల ధోరణితో ఉండాలి. సామర్థ్యం ఉందని భావించాలి' అని ఉతప్ప అన్నాడు.

ఫినిషర్ కోసం ఎదురుచూస్తుంది:
'భారత్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తానని నమ్ముకుతున్నా. విశ్వవిజేతగా నిలిచే జట్టులో నేను భాగం కావొచ్చు. కప్‌ను గెలవడంలో కీలక పాత్ర పోషించవచ్చు. నా కలలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. అప్పటివరకు క్రికెట్ ఆడతాను. రోజు రోజుకి నా ఆట మెరుగుపరుచుకోవడానికి శ్రమిస్తున్నా. నేను ఓపెనర్‌గా రాణించగలను, మిడిలార్డర్‌లోనూ సత్తాచాటగలను. ప్రస్తుతం భారత క్రికెట్ మంచి ఫినిషర్ కోసం ఎదురుచూస్తుంది. దీనిపై తీవ్ర సాధన చేస్తున్నాను' అని ఉతప్ప చెప్పాడు.

మన పనైపోయిందని ఎప్పుడూ అనుకోకూడదు:
'మన పనైపోయిందని మనం ఎప్పుడూ అనుకోకూడదు. అది తప్పు. నాలో ఇంకా ఆట పట్ల కాంక్ష తగ్గలేదు. బాగా ఆడాలన్న తపనతో ఉన్నా. నాలో ఇంకో ప్రపంచకప్ ఆడే సత్తా ఉందని నిజంగా నమ్ముతున్నా. నాకన్నీ కలిసొస్తే ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడినై ఉంటా' అని కర్ణాటక బ్యాట్స్‌మన్ అంటున్నాడు. ఉతప్ప భారత్ తరఫున చివరిగా 2015లో జింబాబ్వేతో టీ20 ఆడాడు. 2011 నుంచి కేవలం 8 వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. 2007 వన్డే ప్రపంచకప్‌తో పాటు అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications