For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కీలక మార్పు: క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త సీఈఓగా కెవిన్ రాబ‌ర్ట్స్‌

Roberts named Cricket Australia CEO

హైదరాబాద్: ఆస్ట్రేలియా జట్టుకు కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఏ)గా కెవిన్ రాబ‌ర్ట్స్‌ నియమితులయ్యారు. ఈ మేరకు క్రికెట్ ఆస్టేలియా(సీఏ) బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఎగ్జిక్యూటివ్‌ సెర్చ్‌ ఎజెన్సీ(ESA) ద్వారా నూతన సీఈఓ నియామకాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా చేపట్టింది.

కెవిన్ రాబర్ట్స్ 2012 నుంచి క్రికెట్ ఆస్ట్రేలియాలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డులో ఆరేళ్ల క్రితమే చేరినప్పటికీ, 2015 నుంచి ఎగ్జిక్యూటివ్ రోల్‌లో కీలకంగా ఉన్నారు. గతేడాది బోర్డుకు, ఆటగాళ్లకు మధ్య జీతభత్యాల విషయంలో నెలకొన్న వివాదాన్ని పరిష్కరించడంలో రాబర్ట్స్ చాలా కీలకంగా వ్యవహారించారు.

 గౌరవంగా భావిస్తున్నా

గౌరవంగా భావిస్తున్నా

ఈ సందర్భంగా కెవిన్ రాబర్ట్స్ మాట్లాడుతూ "క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓగా నియమింపబడటం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు బోర్డుకు ధన్యవాదాలు. క్రికెట్ అనేది మన జాతీయ క్రీడ. వయసు, లింగబేధం అనే తేడా లేకుండా ఎంతో మందిని దగ్గరకు చేర్చడంతో పాటు ప్రేరణగా నిలుస్తుంది" అని తెలిపారు.

 అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా

అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న క్రికెట్ ఆస్ట్రేలియా

"ఈ మధ్య కాలంలో క్రికెట్ ఆస్ట్రేలియా అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. అయితే, మేం మళ్లీ తిరిగి పుంజుకుంటాం. గత చరిత్రను పరిశీలిస్తే మైదానం బయట చోటు చేసుకున్న అనేక ఛాలెంజ్‌లను సమర్ధవంతగా స్వీకరించాం. నా నాయకత్వంలో క్రికెట్ యొక్క అత్యుత్తమ అనుభవాన్ని ప్రతి ఒక్కరి పొందేందుకు గాను మా శాయశక్తులా కృష్టి చేస్తాం" అని రాబర్ట్స్ పేర్కొన్నారు.

 గతంలో ఓ స్పోర్ట్స్ దుస్తుల కంపెనీకి సీఈఓగా పనిచేసిన రాబర్ట్స్

గతంలో ఓ స్పోర్ట్స్ దుస్తుల కంపెనీకి సీఈఓగా పనిచేసిన రాబర్ట్స్

గతంలో కెవిన్ రాబర్ట్స్ ఆస్ట్రేలియాకు చెందిన స్పోర్ట్స్ దుస్తుల కంపెనీ 2XUకి సీఈఓగా పనిచేసిన అనుభవం ఉంది. దీనికి తోడు ఆయన అడిడాస్ కంపెనీతో కూడా పనిచేశారు. యూత్ లెవెల్‌లో న్యూ సౌత్ వేల్స్ జట్టుకు ప్రాతనిథ్యం వహించిన రాబర్ట్స్ 23 ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడారు.

బాల్ టాంపరింగ్ వివాదంతో జేమ్స్ సదర్లాండ్ రాజీనామా

బాల్ టాంపరింగ్ వివాదంతో జేమ్స్ సదర్లాండ్ రాజీనామా

ఈ ఏడాది మొదట్లో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన ఆస్ట్రేలియా... ఆ జట్టులోని పలువురు ఆటగాళ్లు బాల్ టాంపరింగ్ ఘటనకు పాల్పడటం ఆదేశ ప్రతిష్టను దిగజార్చింది. ఈ బాల్ టాంపరింగ్ ఘటనలో ఆస్ట్రేలియాకు చెందిన క్రికెటర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బెన్‌క్రాఫ్ట్‌లపై నిషేధం కూడా విధించారు. ఆ సమయంలో సీఈఏగా ఉన్న జేమ్స్ సదర్లాండ్ తన సీఈఓ పదవికి ఈ ఏడాది జూన్‌లో రాజీమానా చేశారు.

సదర్లాండ్ హయాంలో గణనీయంగా పెరిగిన బోర్డు ఆదాయం

సీఈఓ పదవిలో కొత్తవారిని నియమించే వరకు జేమ్స సదర్లాండ్ 12 నెలల పాటు నోటీసులో ఉన్నారు. ఇప్పుడు అతని స్థానంలో కెవిన్ రాబర్ట్స్ బాధ్యతలు స్వీకరించనున్నారు. సదర్లాండ్ హయాంలో క్రికెట్ ఆస్ట్రేలియాలో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. బోర్డు రెవెన్యూ గణనీయంగా పెరిగింది. అయితే తర్వాతి కాలంలో అదే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తాయి. సెలక్షన్‌ కమిటీ నిర్ణయాల్లో ఆయన జోక్యం ఎక్కువైందని, ముఖ్యంగా బిగ్‌ బాష్‌ లీగ్‌ టోర్నీల్లో లాబీయింగ్‌లు చేశారని ఆయనపై ఆరోపణలు వినిపించాయి.

Story first published: Wednesday, October 3, 2018, 12:49 [IST]
Other articles published on Oct 3, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+