Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చాహల్‌కు ఆర్జే మహవాష్ ఊరమాస్ వార్నింగ్! (వీడియో)

సోషల్ మీడియాలో ఎప్పుడూ తనదైన శైలి ఫన్నీ కంటెంట్‌తో అలరించే ఆర్జే మహవాష్.. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ తో కలిసి చేసిన ఓ ఇన్‌స్టాగ్రామ్ రీల్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆర్జే మహవాష్ .. శిఖర్ ధావన్‌ను తన సొంత అన్నయ్యగా పరిచయం చేసింది. అయితే ఈ వీడియో బయటకు వచ్చిన క్షణం నుంచే నెటిజన్లు, క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కలిపి స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఐపీఎల్ 2026 మ్యాచ్‌ల మధ్యలో యుజ్వేంద్ర చాహల్‌కు ఈ వీడియో ద్వారా కొత్త టెన్షన్ మొదలైందంటూ ఫ్యాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

"నాతో గొడవపడితే గబ్బర్ చూసుకుంటాడు"
ఆ వైరల్ వీడియో విషయానికి వస్తే .. "నాతో గొడవ పడితే చూడు.. ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు" అనే క్యాప్షన్‌తో ఆర్జే మహవాష్ ఈ రీల్‌ను పోస్ట్ చేసింది. ఆ వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ పవర్‌ఫుల్ మ్యూజిక్‌తో శిఖర్ ధావన్ ఎంట్రీ ఇస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. "చాహల్ భయ్యా, జాగ్రత్త! గబ్బర్‌తో నీకు ఆర్జే మహవాష్ దమ్కీ ఇస్తోంది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి యుజ్వేంద్ర చాహల్, శిఖర్ ధావన్ ఇద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. వీరిద్దరూ గతంలో కలిసి ఎన్నో ఫన్నీ రీల్స్ కూడా చేశారు. ఇప్పుడు చాహల్ ప్రాణ స్నేహితుడినే ఆర్జే మహవాష్ అన్నయ్యను చేయడంతో ఫ్యాన్స్ ఈ విషయాన్ని తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

RJ Mahvash Trolls Yuzvendra Chahal Makes Shikhar Dhawan Her Brother in Viral Insta Reel Details

ఆర్జే మహవాష్, యుజ్వేంద్ర చాహల్‌ల మధ్య గతంలో వచ్చిన పుకార్ల వల్లే ఈ వీడియో ఇంతలా వైరల్ అవుతోంది. చాహల్ తన మాజీ భార్య ధనశ్రీ వర్మతో విడాకులు తీసుకున్న తర్వాత, ఆర్జే మహవాష్‌తో కలిసి చాలాసార్లు బయట కనిపించాడు. దీంతో వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ అప్పట్లో గట్టిగా ప్రచారం సాగింది. అంతేకాకుండా ఐపీఎల్ 2025 సీజన్ సమయంలో చాహల్ ప్రాతినిధ్యం వహించిన పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆర్జే మహవాష్ బహిరంగంగానే సపోర్ట్ చేసింది. అయితే తామిద్దరం కేవలం మంచి స్నేహితులం మాత్రమేనని, తమ మధ్య ఎలాంటి రిలేషన్‌షిప్ లేదని అప్పట్లో ఇద్దరూ స్పష్టం చేశారు.

అయితే కొద్దిరోజులకే వీరిద్దరి స్నేహంలో మనస్పర్థలు వచ్చి కట్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత ఆర్జే మహవాష్ కూడా చాహల్ పేరు ఎత్తకుండా సోషల్ మీడియాలో కొన్ని సెటైరికల్ పోస్టులు పెట్టింది. వీరిద్దరి దోస్తీ ముగిసిపోయిందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో.. ఇప్పుడు సరిగ్గా చాహల్ బెస్ట్ ఫ్రెండ్ అయిన శిఖర్ ధావన్‌తో ఆర్జే మహవాష్ ఈ వీడియో చేయడం విశేషం. ఏదేమైనప్పటికీ, ఈ వీడియో కేవలం సరదా కోసం చేసినట్లు కనిపిస్తున్నా.. ఐపీఎల్ టెన్షన్ల మధ్య చాహల్‌ను ట్రోల్ చేయడానికి మాత్రం నెటిజన్లకు మంచి వినోదాన్ని ఇస్తోంది.

Story first published: Tuesday, May 19, 2026, 12:02 [IST]
Other articles published on May 19, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+