వైభవ్ సూర్యవంశీని తిట్టిన రియాన్ పరాగ్? (వీడియో)
ఐపీఎల్ 2026 రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ కీలక నాకౌట్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ తన అద్భుత బ్యాటింగ్‌తో మరోసారి రాణించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటం చేసిన వైభవ్ సూర్యవంశీ.. కేవలం 47 బంతుల్లో 96 పరుగులు చేసి తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. అంతకుముందు జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ వైభవ్ 97 పరుగుల వద్దే ఔట్ కావడం గమనార్హం.
రెండు కీలక మ్యాచ్‌ల్లో వైభవ్ ఇలా సెంచరీలు మిస్ చేసుకోవడం బహుశా కెప్టెన్ రియాన్ పరాగ్‌కు నచ్చినట్లు లేదు. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఔటై డగౌట్‌కు రాగానే.. రియాన్ పరాగ్ వైభవ్ వద్దకు వెళ్లి సీరియస్‌గా మాట్లాడాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో రియాన్ పరాగ్, వైభవ్‌కు ఏదో గట్టిగా క్లాస్ పీకుతున్నట్లు కనిపిస్తోంది. కొంచెం ఓపికగా ఆడి సెంచరీ పూర్తి చేసుకోవాల్సింది అంటూ రియాన్ పరాగ్ మందలించినట్టు ఉండగా.. కెప్టెన్ మాటలకు వైభవ్ ముఖం చిన్నబోయి, ఏడ్చినంత పని చేశాడు.

ఆ వీడియో చూసిన నెటిజన్లు రియాన్ పరాగ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను మాత్రం కేవలం 11 పరుగులు చేసి ఔటై జట్టును ఆదుకున్న యువ ఆటగాడిని అలా డగౌట్లో నిలదీయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా వైభవ్ పరిస్థితిని చూసి బాధపడ్డాడు. అంతకాదు ఈ విషయంలో రియాన్ పరాగా వైఖరిని అశ్విన్ తీవ్రంగా తప్పుబట్టినట్లు తెలుస్తోంది.
ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ బౌలర్ల ధాటికి రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. వైభవ్ సూర్యవంశీతో ఓపెనర్ గా దిగిన యశస్వి జైస్వాల్ కేవలం ఒక్క పరుగుకే ఔట్ కాగా.. ఆ వెంటనే ధ్రువ్ జురేల్ కూడా 9 పరుగులకే వెనుదిరిగాడు. కేవలం 9 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ కష్టాల్లో పడిన తరుణంలో వైభవ్ సూర్యవంశీ సింగిల్ హ్యాండ్‌తో జట్టును నడిపించాడు.
ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా 35 బంతుల్లో 45 పరుగులు చేసి వైభవ్ సూర్యవంశీకి సహకారం అందించాడు. చివర్లో డోనోవన్ ఫెరీరా 38 పరుగులతో మెరుపులు మెరిపించడంతో రాజస్థాన్ రాయల్స్ 200 పరుగుల మార్కును దాటి మొత్తంగా 214 పరుగుల భారీ స్కోరు సాధించగలిగింది. అయితే గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వీరోచిత సెంచరీతో రాజస్థాన్ ఫైనల్ కలలను కల్లలు చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫైనల్ చేరలేకపోయామన్న బాధతో వైభవ్ కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ కలిచివేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications