బుడ్డోడితో ఫోటోకు నిరాకరించిన రియాన్ పరాగ్.. అందరి ముందే సెటైర్! (వీడియో)
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, ఆ జట్టు యువ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. హోటల్ బయట వీరిద్దరినీ కలిసి ఓ ఫోటో ఇవ్వాల్సిందిగా ఫోటోగ్రాఫర్లు కోరారు. అయితే దీనికి రియాన్ పరాగ్ నవ్వుతూ.. "మేమేమీ ఫిల్మ్ స్టార్లం కాదు" అని ఘాటైన సమాధానం ఇస్తూ అక్కడి నుండి వెళ్లిపోయాడు. రియాన్ పరాగ్ ఇచ్చిన ఈ ఒక్క సమాధానం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ కేవలం ఓ బ్యాటర్‌గానే కాకుండా ఓ స్టార్‌గా మారిపోయాడు. వైభవ్ సూర్యవంశీ ఎక్కడికి వెళ్లినా కెమెరాలు అతడి వైపే చూస్తున్నాయి. ముల్లాన్‌పూర్ చేరుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. హోటల్ బయట ఫోటోగ్రాఫర్ల కళ్లు వైభవ్ పైనే ఉన్నాయి. సరిగ్గా అదే సమయంలో కెప్టెన్ రియాన్ పరాగ్ అన్న మాటలు వైభవ్‌తో పాటు అక్కడున్న ఫోటోగ్రాఫర్లను కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపరిచాయి.

హోటల్ వద్ద ఓ ఫోటోగ్రాఫర్ ఎంతో ప్రేమగా.. "సార్, వైభవ్‌తో కలిసి ఒక ఫోటో ఇవ్వండి" అని కోరగా.. రియాన్ పరాగ్ అస్సలు ఆలస్యం చేయకుండా, "మేమేమీ ఫిల్మ్ స్టార్లం కాదు!" అని సమాధానమిచ్చాడు. అంతేకాదు.. తదుపరి సీన్ షూటింగ్‌కు ఆలస్యం అవుతున్నట్లుగా వెంటనే అక్కడి నుంచి క్లిక్ మంటూ ఫ్రేమ్ నుంచి తప్పుకున్నాడు. ఆ సమయంలో వైభవ్ సూర్యవంశీ రియాక్షన్ చూసి తీరాల్సిందే. "అరే భయ్యా, ఒక ఫోటోనే కదా అడిగింది!" అన్నట్లుగా ఆశ్చర్యపోతూ ఉండిపోయాడు. కొద్ది సెకన్ల పాటు అక్కడ ఏం జరిగిందో కూడా అతనికి అర్థం కాలేదు. అందుకే ఈ చిన్న క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అయితే ఇదంతా కేవలం డ్రెస్సింగ్ రూమ్ సరదా కోసమేనని తెలుస్తోంది. ఈ సీజన్ మొత్తం వైభవ్ సూర్యవంశీకీ రియాన్ పరాగ్ ఓ పెద్ద సపోర్టర్‌గా నిలిచాడు. మద్దతు ఇవ్వడంలో తప్పు కూడా లేదు, ఎందుకంటే కేవలం 15 ఏళ్ల వయసున్న ఈ బ్యాటర్ ఐపీఎల్ 2026లో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. ఈ సీజన్ లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీతో ఏకంగా 583 పరుగులు సాధించాడు. అంతేకాకుండా సిక్సర్ల వర్షం కురిపిస్తూ క్రిస్ గేల్ రికార్డుకు చేరువయ్యాడు. జస్‌ప్రీత్ బుమ్రా, జోష్ హేజిల్‌వుడ్, కగిసో రబాడ, మిచెల్ స్టార్క్ వంటి దిగ్గజ బౌలర్లను కూడా వైభవ్ భయం లేకుండా ఎదుర్కొన్న తీరు క్రికెట్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది.
ప్రస్తుతానికైతే ఫోటోగ్రాఫర్లకు వీరిద్దరి కాంబినేషన్లో ఫోటో దొరకలేదు కానీ, వైభవ్ బ్యాట్ ఇలాగే మెరుపులు మెరిపిస్తే.. భవిష్యత్తులో రాజస్థాన్ రాయల్స్ 'బేబీ బాస్' అయిన వైభవ్‌తో ఫోటో దిగడానికి రియాన్ పరాగ్ కూడా లైన్ లో నిలబడాల్సిందేనని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం అందరి కళ్లు మే 27న జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌పైనే ఉన్నాయి, ఇందులో రాజస్థాన్ రాయల్స్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications