Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

6, 6, 6, 6, 6, 6.. 6 బంతుల్లో 6 సిక్సర్లు (వీడియో)

Riyan Parag: ఐపీఎల్ 2025లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కేవలం ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో ముందగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రాజస్తాన్ 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. కానీ లక్ష్యఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ విధ్వంసం సృష్టించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో రియాన్ పరాగ్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో వరుసగా 6 సిక్సులు కొట్టిన ఆటగాడిగా పరాగ్ నిలిచాడు.

మొయిన్ అలీ ఓవర్లో 5 సిక్సర్లు
రియాన్ పరాగ్ మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్లో వరుసగా 5 బంతుల్లో 5 సిక్సర్లు కొట్టాడు. మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్ మొదటి బంతికి షిమ్రాన్ హెట్మెయర్ సింగిల్ తీయగా.. అనంతరం రియాన్ పరాగ్ 5 బంతులను బౌండరీ దాటించేశాడు. మొయిన్ అలీ ఒక వైడ్ కూడా వేశాడు. ఇలా మొయిన్ అలీ వేసిన 13వ ఓవర్లో మొత్తం 32 పరుగులు వచ్చాయి. అనంతరం వరుణ్ చక్రవర్తి వేసిన 14వ ఓవర్లో తాను ఫేస్ చేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఇలా 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదిన ఆటగాడిగా రియాన్ పరాగ్ నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో ఒక బ్యాట్స్‌మన్ వరుసగా 6 సిక్సర్లు కొట్టడం ఇదే తొలిసారి.

Riyan Parag Hits 6 Sixes in 6 Balls

రియాన్ పరాగ్ సెంచరీ మిస్
ఈ మ్యాచ్‌లో రియాన్ పరాగ్ తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. చివరికి రియాన్ పరాగ్ 45 బంతుల్లో 95 పరుగులు చేశాడు. రియాన్ పరాగ్ తన ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. రియాన్ పరాగ్ సెంచరీకి ముందు హర్షిత్ రాణా బౌలింగ్‌లో క్యాచ్ ఔట్ అయ్యాడు.

ఐపీఎల్ 2025 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) మరో విజయాన్నందుకుంది. ప్లే ఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కేకేఆర్ అద్భుతం చేసింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఆదివారం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన కేకేఆర్ ఒక్క పరుగు తేడాతో గెలుపొందింది. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ తమకు అలవాటైన రీతిలోనే మరోసారి గెలుపు ముంగిట బోర్లా పడింది. ఆఖరి బంతికి 3 పరుగులు చేయలేక ఓటమికి తల వంచింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడినా.. రియాన్ పరాగ్(95), శుభమ్‌ దూబే(14 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 25 నాటౌట్) పోరాటం ఆకట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 206 పరుగులు చేసింది. ఆండ్రీ రస్సెల్(25 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 57 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా.. అంగ్‌క్రిష్ రఘువంశీ(31 బంతుల్లో 5 ఫోర్లతో 44), రెహ్మానుల్లా గుర్బాజ్(25 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 35) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్(6 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 19 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్‌వీర్ సింగ్, మహీష్ తీక్షణ, రియాన్ పరాగ్ తలో వికెట్ తీసారు.అనంతరం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 205 పరుగులే చేసి ఓటమిపాలైంది. రియాన్ పరాగ్(45 బంతుల్లో 6 ఫోర్లు, 8 సిక్స్‌లతో 95) ఒంటరి పోరాటం చేసినా ఫలితం లేకపోయింది. కీలక సమయంలో అతను ఔటవ్వడంతో గెలవాల్సిన మ్యాచ్‌లో మరోసారి రాజస్థాన్ రాయల్స్‌ ఓటమిపాలైంది. యశస్వి జైస్వాల్(34), షిమ్రాన్ హెట్‌మైర్(29) పర్వాలేదనిపించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివర్లో శుభమ్‌ దూబే పోరాడిన ఫలితం దక్కలేదు. కేకేఆర్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ, హర్షిత్ రాణా, మోయిన్ అలీ రెండేసి వికెట్లు తీయగా.. వైభవ్ అరోరా ఓ వికెట్ పడగొట్టాడు.

Story first published: Sunday, May 4, 2025, 20:37 [IST]
Other articles published on May 4, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+